TG Crime: వరంగల్‌లో దారుణం.. మూడేళ్ల పాపను ఆ నీచుడు ఏం చేశాడంటే..?

వరంగల్ జిల్లా గిర్మాజిపేటలో రంజాన్ అనే యువకుడు 3 ఏళ్ల పాపపై హత్యాచార యత్నం చేశారు. పాప ఏడవడంతో గమనించిన స్థానికులు రంజాన్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఫోక్సో, హత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

New Update
Crime News : వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న! 

warangal crime news

TG Crime: వరంగల్ నగరంలోని గిర్మాజిపేటలో కామాంధుడు రెచ్చిపోయాడు. పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రంజాన్ అనే యువకుడు వరంగల్ లో నివాసం ఉంటున్నాడు. అక్కడ నివసించే మూడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడవడంతో అక్కడి స్థానికులు అప్రమత్తమై వెంటనే స్పందించారు. నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి వెంటనే ఇంతేజార్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. 

శిక్ష పడేలా చర్యలు..

చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిపై POCSO చట్టంతో పాటు అత్యాచారం, బాలల రక్షణకు సంబంధించిన పలు తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పిల్లల భద్రత విషయంలో సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. నిందితుడిపై త్వరగా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చిన్నారి పరిస్థితి గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పాపకు తగిన వైద్య చికిత్స అందిస్తుండగా ఈ ఘటనపై జిల్లా అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి

( ts-crime | ts-crime-news | latest-news | telugu-news | crime news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు