Pregnant: వేసవిలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో తేమ ఎక్కువగా ఉండే పదార్థాలు, విటమిన్‌లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు ఉండటం చాలా అవసరం. పుచ్చకాయ, జామపండు, కివీ, బ్లాక్‌బెర్రీలు వంటి జ్యూసీ పండ్లు శరీరానికి తేమను అందించడంలో ఎంతో సహాయపడతాయి.

New Update

Pregnant: వేసవి కాలంలో గర్భిణులు తినే ఆహారం శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, శిశువు ఆరోగ్యకరంగా ఎదగడానికి అవసరమైన పోషకాలను అందించాలి. ఈ కాలంలో వేడి కారణంగా డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, అధిక ఉష్ణోగ్రతల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో తేమ ఎక్కువగా ఉండే పదార్థాలు, విటమిన్‌లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు ఉండటం చాలా అవసరం. పుచ్చకాయ, జామపండు, కివీ, బ్లాక్‌బెర్రీలు వంటి జ్యూసీ పండ్లు శరీరానికి తేమను అందించడంలో ఎంతో సహాయపడతాయి.  

ప్రాసెస్ చేసిన పానీయాలు:

ఇది వేసవిలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొంటాయి. అలాగే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లాంటి పోషకాలు గర్భధారణలో అత్యంత అవసరం. వేసవిలో తరచూ మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల తిండి మీద ఆసక్తి తగ్గుతుంది. ఈ సమస్యలను నివారించేందుకు ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, బటర్‌నట్ స్క్వాష్, క్యారెట్, బీట్‌రూట్ వంటి పదార్థాలను ఆహారంలో చేర్చాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే పొటాషియం పుష్కలంగా ఉండే అరటిపండు తినడం వల్ల కాళ్ల నొప్పిని తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లు, లస్సీ, మజ్జిగ వంటి సహజ పానీయాలు శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ శక్తిని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటున్నారా.. జాగ్రత్త

గర్భధారణ సమయంలో శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువగా తినడం మంచిది కాదు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, మసాలా పదార్థాలు, వేయించిన పదార్థాలు, అధికంగా తీపి ఉన్న స్వీట్లు వంటివి తినకూడదు. వీటిలో ఉండే ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ శిశువు అభివృద్ధికి హాని కలిగించవచ్చు. కాఫీ, టీ, కూల్‌ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలు పూర్తిగా నివారించాలి. ఇవి గర్భాశయంలో శిశువు అభివృద్ధిని నెమ్మదిపరచడమే కాకుండా కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యలకూ దారితీయవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.


ఇది కూడా చదవండి: మెంతుల ఫేస్‌ ప్యాక్‌తో ముఖం మెరవడం ఖాయం.. ఇలా చేసుకోండి


( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | food | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు