Fenugreek seeds face mask: మెంతుల ఫేస్‌ ప్యాక్‌తో ముఖం మెరవడం ఖాయం.. ఇలా చేసుకోండి

ప్రతి ఒక్కరూ అందమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. ఈ సీజన్‌లో సహజమైన మెరుపు, మృదువైన చర్మం, ముఖంపై మచ్చలు తగ్గాలంటే మెంతులు వాడటం ఉత్తమమైనది. మెంతుల ఫేస్‌ ప్యాక్‌ చర్మాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది. ఇది చర్మపు నూనెను సమతుల్యం చేస్తుంది.

New Update

Fenugreek Seeds Face Mask: వేసవి కాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మార్కెట్లో లభించే ఖరీదైన, రసాయనాలు బ్యూటీ వస్తువులు వాడితే అనేక చర్మ సమస్యలు వస్తాయని చర్మ నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే.. మెంతి గింజలు జుట్టుతోపాటు చర్మ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి. ప్రతి ఒక్కరూ అందమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. ఈ సీజన్‌లో సహజ నివారణల చిట్కాలు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సహజ నివారణలలో మెంతులు వాడటం ఉత్తమమైనది. ఇది ఆరోగ్యంలోనే కాకుండా చర్మ సంరక్షణలో కూడా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్, పొడిబారడం వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. మెంతులు ఎలా ఉపయోగించాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మెంతి ఫేస్ మాస్క్ ప్రయోజనాలు:

మెంతులతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా అప్లై చేస్తే అది చర్మాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది. చర్మం నుండి మచ్చలు, ముడతలను తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా  పని చేస్తుంది. మొటిమలు, మచ్చల సమస్యను తగ్గించడంలో మెంతి గింజలు ఉపయోగపడతాయి. ఇది చర్మపు నూనెను సమతుల్యం చేసి చర్మాన్ని మృదువుగా చేస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.

కావాల్సిన పదార్థాలు: 

 మెంతులు - 1 టీస్పూన్, పెరుగు, తేనె - 1 టీస్పూన్ , రోజ్ వాటర్ - 1 టీస్పూన్ అవసరం పడుతాయి. ముందుగా, 1 టీస్పూన్ మెంతుల గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌లో పెరుగు, తేనె కలపాలి. మీకు కావాలంటే 1 టీస్పూన్ రోజ్ వాటర్ కూడా కలపవచ్చు. దీనిని ముఖం మీద అప్లై చేయాలి. ఈ ఫేస్ మాస్క్‌ను ముఖం, మెడపై సమానంగా అప్లై చేయాలి. కళ్ళ చుట్టూ అప్లై చేయవద్దు. ఈ ప్యాక్‌ను 15 -20 నిమిషాలు ఆరిన తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.  తర్వాత చేతులతో సున్నితంగా మసాజ్ చేసి ముఖాన్ని టవల్‌తో తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించాలి. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల సహజమైన మెరుపు, మృదువైన చర్మం, ముఖంపై మచ్చలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రోజూ గంట నడిస్తే ఎన్ని కిలోల బరువు తగ్గవచ్చు?

( fenugreek-seeds | fenugreek-seeds-water | face-mask | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు