Pimple: అక్కడ మొటిమలు వస్తే ఇక అంతే సంగతులు

ముఖంలోని ముక్కు పైభాగం నుంచి పెదవుల మూలల వరకు ఉన్న ప్రాంతాన్ని ట్రయాంగిల్ ఆఫ్ డెత్ అని అంటారు. ఈ భాగం మెదడుకు నేరుగా రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళాలను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతం చాలా సున్నితమైనది కాబట్టి నేరుగా మెదడుకు చేరే అవకాశం ఉంది.

New Update
pimple nose

pimple Nose

ముఖంపై మొటిమలు చాలామందిని ఇబ్బంది పెట్టే ఒక సాధారణ చర్మ సమస్య. దీనిని యాక్నే అని కూడా అంటారు. యుక్తవయసులో హార్మోన్ల మార్పుల వల్ల ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మొటిమలు ఎక్కువగా నూనె గ్రంథులు మూసుకుపోవడం, బ్యాక్టీరియా, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోవడం వల్ల ఏర్పడతాయి. ముఖం, మెడ, వీపు, ఛాతీ భాగాలపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది. ఇవి నొప్పి, దురద, ఎర్రటి దద్దుర్లు, ఒక్కోసారి చీము పట్టిన గడ్డలుగా మారవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మంపై మచ్చలు కూడా ఏర్పడతాయి. సాధారణంగా, సరైన చర్మ సంరక్షణ పద్ధతులు పాటించడం వల్ల వీటిని అదుపు చేయవచ్చు. అయితే ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం అయినప్పటికి వాటిని గిల్లితే లేదా నొక్కితే ప్రమాదమని అందరికీ తెలుసు. కానీ ముఖంలో ఓ ప్రత్యేకమైన భాగంలో మొటిమలను గిల్లితే అది ప్రాణాంతకమయ్యే అవకాశముందని చాలామందికి తెలియదు. దీనినే ట్రయాంగిల్ ఆఫ్ డెత్ లేదా మరణ త్రికోణం అని పిలుస్తారు. ఈ ప్రాంతం మన ముక్కు వంతెన నుంచి నోటిపై పెదవుల వరకు విస్తరించి ఉంటుంది.  ప్రాణాంతకమయ్యే ముఖంపై మొటిమలు ట్రయాంగిల్ ఆఫ్ డెత్ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

 ప్రాణాలను తీయగలదు..

మన ముఖంలోని ముక్కు పైభాగం నుంచి పెదవుల మూలల వరకు ఉన్న ప్రాంతాన్ని ట్రయాంగిల్ ఆఫ్ డెత్ అని అంటారు. ఈ భాగం మన మెదడుకు నేరుగా రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళాలను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతం చాలా సున్నితమైనది. కాబట్టి ఇక్కడ ఏ విధమైన ఇన్ఫెక్షన్ వచ్చినా.. అది నేరుగా మెదడుకు చేరే అవకాశం ఉంది. ఈ మొటిమలను గిల్లితే లేదా నొక్కితే.. చర్మంపై ఉండే బ్యాక్టీరియా మన చేతుల ద్వారా చర్మం లోపలికి వెళ్లి రక్తంలో కలుస్తుంది. ఈ బ్యాక్టీరియా నేరుగా మెదడుకు చేరుకుని తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీనివల్ల మెదడులో రక్తం గడ్డ కట్టడం, మెదడులో చీము చేరడం, మెదడు కవచం వాపు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

ఇది కూడా చదవండి: గర్భ ధారణలో శారీరక సంబంధం వల్ల ఎంత ప్రయోజనమో ఇప్పుడే తెలుసుకోండి!!

ట్రయాంగిల్ ఆఫ్ డెత్ ప్రాంతంలో మొటిమలను గిల్లితే.. ఆ తరువాత తీవ్రమైన నొప్పి, వాపు లేదా దృష్టి మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే.. అది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు సంకేతం కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.  దీని నుంచి రక్షించుకోవడానికి మొట్టమొదటగా చేయాల్సిన పని ముఖం మీద మొటిమలను గిల్లితే లేదా నొక్కడం ఆపివేయడం. అలాగే ముఖాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తరచుగా నీళ్లు తాగాలి. మొటిమలు పెద్దగా ఉంటే వాటిని ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి మీ చేతి ద్వారా ఇతర ప్రదేశాలకు వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. నివారణకు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: థైరాయిడ్ బాధపడుతున్నారా..? అయితే ఇవి మాత్రం అస్సలు తినకండి..!!

Advertisment
తాజా కథనాలు