/rtv/media/media_files/2025/09/17/adult-diapers-and-skin-rashes-2025-09-17-16-45-10.jpg)
Adult Diapers and Skin Rashes
వయసు పెరిగే కొద్దీ చర్మం సున్నితంగా, పలచగా మారుతుంది. ఈ సమయంలో వృద్ధులు తరచుగా డైపర్లు వాడడం వలన చర్మంపై దద్దుర్లు, దురద, ఎరుపు వంటి సమస్యలు వస్తాయి. ఇంట్లో తల్లిదండ్రులు లేదా తాతయ్య, నానమ్మ డైపర్లు(Diapers) వాడితే.. వారి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని చిట్కాలను ఉన్నాయి. వృద్ధుల చర్మానికి దద్దుర్లు(skin-rashes) రాకుండా ఉండాలంటే.. డైపర్‌ను సమయానికి మార్చడం చాలా ముఖ్యం. తడి డైపర్‌ను ఎక్కువ సేపు ఉంచితే తేమ, బ్యాక్టీరియా పెరిగి చర్మ ఇన్ఫెక్షన్లకు, దద్దుర్లకు దారితీస్తుంది. అయితే చర్మంపై దద్దుర్లు రావడం వల్ల వృద్ధులు పెద్దల డైపర్లు ధరించడానికి ఇష్టపడరు. వాటిని ఏ విధంగా ఉపయోగించాలో.. కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
డైపర్ల వాడకంలో జాగ్రత్తలు..
ప్రతి 5-6 గంటలకోసారి డైపర్‌ను మార్చడం మంచిది. ఒకవేళ డైపర్ తడిస్తే వెంటనే మార్చాలి. డైపర్‌ను మార్చేటప్పుడు గోరువెచ్చని నీటితో సున్నితంగా చర్మాన్ని శుభ్రం చేయాలి. సువాసన లేని.. సున్నితమైన వెట్ వైప్స్ కూడా వాడవచ్చు. శుభ్రం చేసిన తర్వాత చర్మాన్ని పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడిగా ఉన్న చర్మంపై కొత్త డైపర్ వేస్తే దద్దుర్లు త్వరగా వస్తాయి. వృద్ధుల చర్మంపై డైపర్ వేయడానికి ముందు సువాసన లేని మాయిశ్చరైజర్ లేదా బ్యారియర్ క్రీమ్ వాడాలి. ఇది చర్మంపై ఒక రక్షణ పొరలా పనిచేసి తేమ, రాపిడి వలన కలిగే ప్రభావాలను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె లేదా కలబంద గుజ్జు వంటి సహజ పదార్థాలు కూడా చర్మాన్ని కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: యవ్వనంలో ఆర్థరైటిస్ సమస్యా..? అయితే ఈ ఆయుర్వేద చికిత్స గురించి తెలుసుకోండి
సరైన సైజును ఎంచుకోవడం చాలా ముఖ్యం. పెద్ద లేదా చిన్న డైపర్‌ను వాడితే చర్మంపై రాపిడి పెరిగి దద్దుర్లు ఎక్కువవుతాయి. వృద్ధుల శరీరానికి సరిపోయే డైపర్‌ను ఎంచుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే నాణ్యమైన డైపర్లనే వాడాలి. ఎందుకంటే తక్కువ నాణ్యత గలవి త్వరగా తడిచి చర్మానికి అలెర్జీని కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజులో కొన్ని గంటల పాటు డైపర్ లేకుండా ఉంచాలి. దీనివల్ల చర్మానికి గాలి తగిలి ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిసారి డైపర్ మార్చేటప్పుడు 10-15 నిమిషాల పాటు డైపర్ లేకుండా ఉంచడం వల్ల తేమ తగ్గి.. దద్దుర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా వృద్ధుల చర్మాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచవచ్చు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మంచి చర్మ డాక్టర్ల సహాలు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:నిద్ర తక్కువ పోయే వారికి షాకింగ్ న్యూస్.. ఆ కొత్త రోగం గ్యారెంటీ..?