/rtv/media/media_files/2025/10/25/belly-fat-2025-10-25-10-11-06.jpg)
Belly Fat
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య బరువు పెరగడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే మొండి కొవ్వు. డైట్, వ్యాయామం చేసినా కొవ్వు తగ్గడం లేదని నిరాశ చెందుతున్నవారు చాలామంది ఉన్నారు. అయితే పోషకాహార నిపుణులు ఇచ్చిన సలహా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ కేవలం ఒక టీస్పూన్ ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తీసుకోవడం ద్వారా పొట్ట కొవ్వును తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఆ అద్భుతమైన పదార్థం మరేదో కాదు... ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ (Extra Virgin Olive Oil). దీనితో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మొండి కొవ్వుకు చెక్..
ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది రసాయనాలు లేకుండా.. ఆలివ్ పండ్ల నుంచి నేరుగా తీసిన నూనె. ఇది గుండె ఆరోగ్యానికి, జీవక్రియ (మెటబాలిజం) మెరుగుదలకు బాగా ప్రసిద్ధి చెందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. PREDIMED ట్రయల్, 16,000 మంది వయోజనులపై జరిపిన అధ్యయనంలో.. ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా తీసుకునే వ్యక్తులు నడుము చుట్టుకొలతను వేగంగా తగ్గించుకోగలిగారని తేలింది. అంతేకాకుండా ఆలివ్ నూనెలో ఒలేయిక్ యాసిడ్ (Oleic Acid) ఉంటుంది. ఇది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును శక్తి కోసం ఉపయోగించుకునేలా ప్రేరేపిస్తుంది., తద్వారా కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. ఆలివ్ నూనెలో ఉండే ఒలియోకాంథాల్' (Oleocanthal) అనే ప్రత్యేక సమ్మేళనం సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది శరీరంలో ముఖ్యంగా కడుపు, ప్రేగులలోని మంటను తగ్గిస్తుంది. దీనివల్ల ఉబ్బరం (Bloating), బరువుగా అనిపించే సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ పొడి ఒక్క చెంచా తాగితే చాలు.. 85% రోగాలు పరార్.. తప్పక తెలుసుకోండి!
మెటబాలిక్ సిండ్రోమ్, ఇన్సులిన్ నిరోధకత సమస్య ఉన్నవారికి కూడా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను స్థిరీకరించి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. తద్వారా చక్కెర పెరగడం, కొవ్వు నిల్వ రెండూ తగ్గుతాయి. మెరుగైన ఇన్సులిన్ ప్రతిస్పందన కారణంగా.. కాలేయం కొవ్వును నిల్వ చేయడానికి బదులుగా.. దాన్ని విచ్ఛిన్నం చేసి శక్తిగా మారుస్తుంది. ఇది ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను మెరుగుపరుస్తుంది, శరీర నిర్విషీకరణ (Detoxification) ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే రోజుకు కేవలం టీస్పూన్ ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. దీన్ని సలాడ్‌పై వేసుకోవచ్చు, పప్పులో కలుపుకోవచ్చు లేదా టోస్ట్‌పై స్ప్రెడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాడుతున్న నూనెకు బదులుగా దీన్ని ఉపయోగించాలి. ఈ అలవాటును కేవలం 30 రోజులు పాటిస్తే.. పొట్ట కొవ్వులో తేడా కనిపించడమే కాకుండా.. శక్తి, జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పరగడుపున వెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా..? ప్రయోజనాలతోపాటు నష్టాలు ఉన్నాయని తెలుసుకోండి!!
Follow Us