/rtv/media/media_files/2025/10/24/health-tips-2025-10-24-12-20-44.jpg)
Health Tips
ఆనారోగ్య సమస్యలు(health-problems) ఏవైనా సరే.. వాటికి ఆయుర్వేదం(Ayurvedha) లో ఒక సరళమైన, ప్రభావవంతమైన పరిష్కారం ఉంది. దీనిని సర్వరోగ నివారిణి అని కూడా చెప్పవచ్చు. కేవలం మూడు పదార్థాలతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఈ పొడిని క్రమం తప్పకుండా వాడటం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రోగాలను తరిమే పొడి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఇంట్లోనే సర్వరోగ నివారిణి పొడి:
మెంతులు (Fenugreek Seeds): 250 గ్రాములు, వాము (Ajwain): 100 గ్రాములు, నల్ల జీలకర్ర (Kalonji/Black Cumin): 50 గ్రాములు. ముందుగా ఈ మూడు పదార్థాలను శుభ్రం చేసుకోవాలి. వాటిని వేరువేరుగా తీసుకుని పెనంపై దోరగా (బ్రౌన్ రంగు వచ్చేవరకు) వేయించాలి. వేయించిన తర్వాత మెంతులు, వాము, నల్ల జీలకర్రను కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీస్పూన్ ఈ పొడిని కలిపి తాగాలి. గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే.. ఈ పొడిని కేవలం వేడి నీటితో మాత్రమే తీసుకోవాలి, ఈ నీరు తాగిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. అన్ని వయస్సుల వారు స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు కూడా ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు. పొడిని నిత్యం తీసుకోవడం వలన శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు (Toxins), మలం, మూత్రం, చెమట ద్వారా బయటకు వెళ్లిపోతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని 80 నుంచి 90 రోజుల వరకు తాగితే అత్యుత్తమ ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: రాగి పాత్రలు, నల్ల జుట్టుకు సంబంధం ఏంటో తెలుసా..?
శరీర శుద్ధి:అధిక కొవ్వు కరిగిపోతుంది. రక్తం శుభ్రపడి, మంచి రక్తం ఉత్పత్తి అవుతుంది.
చర్మానికి, శరీరానికి:శరీరంలోని ముడతలు తగ్గి, కాంతివంతంగా, బలంగా, చురుకుగా మారుతుంది.
ఎముకల ఆరోగ్యం: కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోయి, ఎముకలు బలంగా తయారవుతాయి.
జీర్ణ వ్యవస్థ:మలబద్ధకం శాశ్వతంగా నివారించబడుతుంది.
జ్ఞాపకశక్తి, ఇంద్రియాలు: కంటిచూపు, వినికిడి శక్తి, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి.
గుండె, రక్త ప్రసరణ:రక్త ప్రసరణ మెరుగుపడి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తనాళాలు శుభ్రపడతాయి.
ఇతర సమస్యలు:దీర్ఘకాలిక దగ్గు, పంటి చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుంది. గతంలో తీసుకున్న అల్లోపతి ఔషధాల ప్రభావాలను కూడా ఇది శరీరం నుంచి క్లీయర్ చేయడంలో సహాయపడుతుంది. మొదట 3 నెలలు ఈ పొడిని వాడిన తర్వాత ఒక నెల విరామం ఇచ్చి.. అవసరం అనుకుంటే మళ్లీ ప్రారంభించవచ్చు. ఈ సరళమైన ఆయుర్వేద చిట్కాతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కార్తీక మాసంలో తప్పక చేయాల్సిన 10 పనులు ఏంటో తెలుసా..?
Follow Us