/rtv/media/media_files/2025/03/30/runningfast9-244428.jpeg)
Running
మారిన జీవనశైలి వల్ల చాలా మంది ఊబకాయం సమస్యల బారిన పడుతున్నారు. దీంతో ఈజీగా బరువు తగ్గాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రన్నింగ్ చేస్తారు. పరిగెత్తడం వల్ల బాడీలోకి కేలరీలు బర్న్ అయి తగ్గుతారని భావిస్తారు. అయితే బరువు తగ్గాలని ఒక్కసారి అధికంగా పరిగెడితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
ఒక్కసారి అధికంగా రన్నింగ్ చేస్తే..
అప్పటి వరకు పరిగెత్తడం అలవాటు లేని వారు బరువు తగ్గాలని ఒక్కసారిగా పరిగెత్తుతుంటారు. ఇలా చేయడం వల్ల శ్వాసక్రియ రేటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలని రన్నింగ్ చేస్తే నెమ్మదిగా చేసుకుంటూ పోవాలి. కాస్త అలవాటు పడిన తర్వాత అధికంగా రన్నింగ్ చేసినా పర్లేదని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI
బరువు తగ్గాలని రన్నింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. రన్నింగ్ చేస్తే బాడీ మొత్తం కదులుతుంది. దీంతో కండరాలు అన్ని కూడా బలంగా తయారు అవుతాయి. అలాగే ఆరోగ్యంగా ఫిట్‌గా కనిపిస్తారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా పెద్దగా రావు. రన్నింగ్ వల్ల బాడీకి వ్యాయామం అవుతుంది. దీంతో యంగ్ లుక్‌లో కనిపిస్తారు. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: పాకిస్థాన్ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.