Revanth Reddy: లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త!

తమ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచే నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ ప్రకటించారు. తుంగతుర్తిలో ఈ రోజు జరుగుతున్న రేషన్ కార్డుల పంపిణీ సభలో ఆయన మాట్లాడారు.

New Update
CM Revanth

CM Revanth

తమ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచే నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఈ రోజు జరిగిన రేషన్ కార్డుల పంపిణీ సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో 95.56 లక్షలకు రేషన్ కార్డుల సంఖ్య చేరనుంది. కొత్త రేషన్‌ కార్డులతో 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

సీఎం రేవంత్ మాట్లాడుతూ ''కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే నల్గొండ జిల్లాకు నీళ్లు అందిస్తున్నాయి. మూడు అడుగుల స్థానిక నాయకుడు ఎగిరెగిరి పడుతున్నాడు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిందా ?. మేము లక్షలాది మంది పేదలకు సన్నబియ్యం ఇస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు.రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇచ్చి చూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొడుతుందని ప్రచారం చేశారు. కేవలం 9 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా నిధులు అందించాం. 

Also Read: అన్‌డాకింగ్‌ సక్సెస్‌ఫుల్‌.. మరికొన్ని గంటల్లో భూమిపైకి శుభాంశు బృందం

Also Read :  రొమాంటిక్ గా మారిన ప్రియదర్శి.. 'ప్రేమంటే' ఫస్ట్ లుక్

Revanth Reddy Comments On Employment In TG

వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. 18 నెలల్లో ఫ్రీ బస్సు ప్రయాణానికి రూ.6500 కోట్లు ఖర్చు చేశాం. కేసీఆర్‌ కట్టిన కాలేశ్వరం ఆయన హయాంలోనే కూలేశ్వరం అయ్యింది. కూలేశ్వరం దగ్గర వారిని ఉరి తీసినా తప్పులేదు. జిల్లాలో గెలిచిన ఒక్క ఏకలింగం (బీర్ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డిని ఉద్దేశిస్తూ)  ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తులసివనంలో గంజాయి మొక్కలా గెలిచాడు. నాడు గంజికి లేని ఆ నాయకుడు ఇప్పుడు బెంజి కార్లలో తిరుగుతున్నాడు. 

ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకునే నాటికి 2 లక్షల ఉద్యోగాలు అందిస్తాం. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టాలి. నాలుగు ఎమ్మెల్సీల్లో మూడు నల్గొండ జిల్లాకే ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ రాబోయే పదేళ్లు అధికారంలో ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని'' సీఎం రేవంత్ అన్నారు. 

Also Read: మోదీపై అభ్యంతరకర కార్టూన్‌.. భావా ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగంపై సుప్రీం ఆగ్రహం

Also Read :  లంగావోణీలో రాశి అందాలు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా?

rtv-news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news

Advertisment
Advertisment
తాజా కథనాలు