/rtv/media/media_files/2025/05/14/x6KyLNK4KJNzdAwvH7On.jpg)
Lychee Fruit
Lychee Fruit Benefits: వేసవి కాలంలో(Summar Season) లభించే లిచీ పండ్లు తీపిగా, పుల్లగా ఉంటాయి. ఇవి రుచితోపాటు చక్కని సువాసనతో మనసులను ఆకట్టుకుంటాయి. ఈ పండు మధ్యలో ఒక్కటే గోధుమ రంగు విత్తనాన్ని కలిగి ఉంటుంది. తాజా రూపంలో లేదా ఎండబెట్టిన రూపంలో లభించే ఈ పండ్లను జ్యూస్‌లు, జామ్‌లు, ఇతర ఆహార పదార్థాల్లోనూ వాడతారు. అయితే లిచీని కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్య పరంగా తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం. లిచీలో విటమిన్ సి, బి6, నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలేట్, రాగి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పుష్కలమైన పోషకాలున్నాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
ఇది కూడా చూడండి: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..
చెడు కొలెస్ట్రాల్(Bad Cholesterol)ను తగ్గించడంతో..
లిచీ తినడం వల్ల తెల్ల రక్త కణాల(White Blood Cell) ఉత్పత్తి మెరుగవుతుంది. దీనివల్ల శరీరం బలంగా మారుతుంది. జీర్ణక్రియను సవ్యంగా నిర్వహించడంలో లిచీ కీలక పాత్ర పోషిస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడతాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండడం వలన ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: పాలు తాగుతూ నిద్రపోయే చిన్నారుల వెనుక ఉన్న కారణం ఇదే
ఇది అధికాహారం తీసుకునే అలవాటును తగ్గించడంలో దోహదపడుతుంది. పొటాషియం అధికంగా ఉండటంతో రక్తపోటు నియంత్రణలోకీ ఇది ఉపయోగపడుతుంది. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా చర్మాన్ని బలంగా, మెరుపుగా, స్థితిస్థాపకంగా ఉంచుతుంది. చర్మంపై పేరుకున్న మురికిని తొలగించి ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తుంది. ఈ విధంగా లిచీ పండు కేవలం రుచికే పరిమితం కాకుండా శరీర ఆరోగ్యాన్ని సమగ్రంగా మెరుగుపరిచే ఔషధ గుణాలు కలిగి ఉన్న పండు. ఎండవెలుతురుతో నిండి ఉండే వేసవిలో తేలికగా దొరికే లిచీ పండును ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి మంచి లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఇంట్లో చేపలు పెంచడం వల్ల కలిగే అదృష్టం ఇదే
( lychee-fruit-icecream-recipe | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)