Waterfall: కాకోలాట్ జలపాతం.. ప్రకృతి ప్రేమికుల కోసం ఓ దివ్యధామం

బీహార్ రాష్ట్రంలోని నవాడా జిల్లాలో కాకోలాట్ జలపాతం ఉంది. కాకోలాట్ జలపాతం సుమారు 160 అడుగుల ఎత్తు నుంచి నీటిని కిందకు వదులుతుంది. ఈ జలపాతం చుట్టూ పచ్చని అడవులు, కొండలు ఉండటంతో ప్రకృతి ప్రేమికులకు ఇది ఓ శాంతియుత స్వర్గధామంగా అనిపిస్తుంది.

New Update
Chocolate waterfall

Chocolate waterfall

Chocolate Waterfall: ప్రకృతిలోని అందాలు మనస్సును మెప్పిస్తూనే ఉంటాయి. వాటిలో సరస్సులు, పర్వతాలు, అడవులు, జలపాతాలు ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచిన ఒక ప్రదేశం బీహార్ రాష్ట్రంలోని నవాడా జిల్లాలో ఉన్న కాకోలాట్ జలపాతం. ఇది కేవలం ఒక సహజ దృశ్యమే కాకుండా ఇతిహాసాలు, పురాణ గాథలతో ముడిపడి ఉన్న ఒక పవిత్ర ప్రదేశంగా చెబుతున్నారు. ఈ జలపాతాన్ని చూసినవారు ప్రకృతి మహిమపై మంత్రముగ్ధులవుతారు. కాకోలాట్ జలపాతం సుమారు 160 అడుగుల ఎత్తు నుంచి నీటిని కిందకు వదులుతుంది. ఈ జలపాతం చుట్టూ పచ్చని అడవులు, కొండలు ఉండటంతో ప్రకృతి ప్రేమికులకు ఇది ఓ శాంతియుత స్వర్గధామంగా అనిపిస్తుంది. జలపాతాన్ని చూస్తూ నిలబడి, శబ్దాల మధ్య ప్రకృతితో మమేకం కావడం అనేది జీవితం నిండిన అనుభూతిని కలిగిస్తుంది. 

Also Read :  లిచీ పండుతో బోలెడు లాభాలు.. ఓ లుక్కేయండి!

శాపం నుండి విముక్తి..

నైరుతి మౌసంల్లో ఎక్కువగా సందర్శకులు ఇక్కడికి వస్తారు. కాకోలాట్ నీరు ఏడాది పొడవునా చల్లగా ఉండడం విశేషం. ఇది భారతదేశంలోని ఉత్తమ జలపాతాలలో ఒకటిగా చెబుతారు. ఈ ప్రదేశానికి సంబంధించి పలు పురాణ కథలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం.. త్రేతాయుగంలో ఒక రాజు ఋషి శాపం వల్ల కొండచిలువ రూపంలో ఇక్కడ నివసించాల్సి వచ్చింది. తరువాత పాండవులు వనవాస సమయంలో ఈ ప్రదేశానికి వచ్చినపుడు.. ఆ రాజు ఈ జలపాతంలో స్నానం చేయడంతో శాపం నుండి విముక్తి పొందాడు. అప్పటి నుంచి ఈ నీటిని పవిత్రంగా భావిస్తూ భక్తులు స్నానం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: పాలు తాగుతూ నిద్రపోయే చిన్నారుల వెనుక ఉన్న కారణం ఇదే

మరో కథ ప్రకారం.. శ్రీకృష్ణుడు తన రాణులతో కలిసి ఇక్కడికి వచ్చి స్నానం చేసినట్టు చెబుతారు. అందుకే ఈ నీటిని పవిత్రతకు ప్రాతినిధ్యంగా చెబుతారు. చైత్ర మాసంలో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తారు. ఇక్కడికి చేరడం కూడా అంత కష్టమైనది కాదు.  దీని దగ్గరకు వెళ్లాలంటే సమీప విమానాశ్రయం పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లవచ్చు. రైలులో వెళ్లాంటే నవాడా రైల్వే స్టేషన్ సమీపంగా ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా నవాడా నుంచి 34 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రకృతిని సున్నితంగా ఆస్వాదించాలనుకునే వారెవరైనా కాకోలాట్ జలపాతాన్ని ఒకసారి తప్పక సందర్శించాలి. ఇది మనిషి సృష్టించిన అందాల కంటే ప్రకృతి అందాలు కాబట్టి మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన పిల్లర్ గుంత!

Also Read :  వేసవిలో చల్లదనాన్ని పంచే మామిడి ఫలూదా.. దీనిని సింపుల్‌గా ఇలా చేసుకోండి


( beautiful-waterfalls | behar )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు