Junk Food: నాలుగు రోజులు చాలు జంక్ ఫుడ్ మీ బుర్రను తినేయడానికి!!

ఫ్యాటీ జంక్ ఫుడ్స్ బరువు పెరగడం లేదా మధుమేహం రావడం కంటే ముందే మెదడుపై దాడి చేస్తాయి. ఈ ఆహారాల వల్ల ఆలోచనా, గ్రహణశక్తిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ పరిశోధన ఫలితాలు ఊబకాయం, జ్ఞాపకశక్తి లోపానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

New Update
Junk Food

Junk Food

వారాంతంలో లేదా ఏ పండుగకైనా జంక్ ఫుడ్స్‌ను తింటున్నారా..? అయితే జాగ్రత్త.. ఎందుకంటే ఇలాంటి ఆహారాలు శరీరానికే కాదు మెదడుకు కూడా తీవ్రమైన హాని కలిగించవచ్చని కొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కేవలం నాలుగు రోజులు నిరంతరంగా ఫ్యాటీ జంక్ ఫుడ్స్ తినడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతోపాటు ఆలోచనా శక్తి కూడా ప్రభావితం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ (UNC) పరిశోధన ప్రకారం.. ఫ్యాటీ జంక్ ఫుడ్స్ బరువు పెరగడం లేదా మధుమేహం రావడం కంటే ముందే మెదడుపై దాడి చేస్తాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆలోచనా, గ్రహణశక్తిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ పరిశోధన ఫలితాలు ఊబకాయం, జ్ఞాపకశక్తి లోపానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి పశ్చిమ దేశాల ఆహారపు అలవాట్లను, ముఖ్యంగా జంక్ ఫుడ్స్‌ను తగ్గించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి, మెదడుకి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

మెదడును దెబ్బతీసే ప్రమాదం..

మరో పరిశోధన ప్రకారం.. హై-ఫ్యాట్ డైట్ (HFD) తిన్న తర్వాత హిప్పోకాంపస్లోని కొన్ని ప్రత్యేకమైన మెదడు కణాలు, అంటే సీసీకే ఇంటర్ న్యూరాన్లు మరింత చురుకుగా పనిచేస్తాయి. ఈ కణాలు అతిగా చురుకవడం వల్ల మెదడు గ్లూకోజ్‌ను సరిగా తీసుకోలేకపోతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి దెబ్బతింటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ అతి చురుకుదనం హిప్పోకాంపస్ జ్ఞాపకశక్తిని ప్రాసెస్ చేసే పద్ధతిని అడ్డుకుంటుంది. హై-ఫ్యాట్ డైట్ తీసుకున్న కొన్ని రోజుల వరకు కూడా ఈ ప్రభావం కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో పీకేఎం2 అనే ప్రోటీన్ ఈ సమస్యను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని కూడా వెల్లడైంది. ఈ ప్రోటీన్ మెదడు కణాలు శక్తిని ఎలా ఉపయోగించుకుంటాయో నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ముక్కు వెంట్రుకలు కత్తిరించుకుంటే ఊపిరితిత్తులు ఎలా ప్రభావితం అవుతాయో తెలుసా..?

పరిశోధకులు జంక్ ఫుడ్స్ ప్రభావాలను పరీక్షించడానికి ఎలుకలను హై-ఫ్యాట్ డైట్‌పై ఉంచారు. కేవలం నాలుగు రోజుల్లోనే వాటి మెదడులోని సీసీకే ఇంటర్ న్యూరాన్లు అసాధారణంగా చురుకుగా మారినట్లు కనుగొన్నారు. అయితే మెదడులోని గ్లూకోజ్ స్థాయిలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం ద్వారా ఆ న్యూరాన్లు శాంతించాయని.. వాటి జ్ఞాపకశక్తి సమస్యలు కూడా పరిష్కారమయ్యాయని ఈ ప్రయోగం ద్వారా తెలిసింది. ఈ అధ్యయనం ప్రకారం.. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, కొన్ని రకాల ఔషధాల ద్వారా ఊబకాయం సంబంధిత నాడీ క్షీణతను నివారించవచ్చు. పరిశోధకులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. దీనివల్ల సీసీకే ఇంటర్ న్యూరాన్లు సాధారణ స్థితికి వస్తాయని.. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఉడకని చికెన్ తినడం వల్ల పక్షవాతం వస్తుందా?.. వైద్యుల అభిప్రాయం తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు