/rtv/media/media_files/2025/10/27/mosquitoes-2025-10-27-09-42-29.jpg)
Mosquitoes
సాయంకాలం అవుతుందంటే చాలు.. ఇళ్లలో దోమల బెడద ఎక్కువైపోతుంది. ఇంట్లో మొక్కలు ఎక్కువగా ఉన్నవారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇంట్లో దోమలను తరిమికొట్టడానికి చాలామంది రసాయనాలతో కూడిన కాయిల్స్ లేదా లిక్విడ్ రిపెల్లెంట్లను ఉపయోగిస్తారు. అయితే.. వీటి ప్రభావం సరిగా ఉండదు, పైగా వీటి నుంచి వచ్చే పొగ ఆరోగ్యానికి చాలా హానికరం. దోమలను తరిమికొట్టే సహజమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. వంటింట్లో దొరికే కొన్ని సాధారణ వస్తువులతో ఈ అద్భుతమైన రిపెల్లెంట్‌ను తయారు చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించడం ద్వారా ఇంట్లో దోమల బెడద పూర్తిగా తొలగిపోతుంది. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
దోమల రిపెల్లెంట్ తయారీకి..
ఈ అద్భుతమైన రిపెల్లెంట్ తయారు చేయడానికి ఈ నాలుగు వస్తువులు అవసరం. టీ పొడి (Tea Leaves), లవంగాలు (Cloves), దాల్చినచెక్క (Cinnamon), ఆవ నూనె (Mustard Oil), వీటితో పాటు ఒక మూత ఉన్న గాజు పాత్ర, దూదితో చేసిన వత్తి కూడా కావాలి. ఈ రిపెల్లెంట్‌ను తయారు చేయడం చాలా సులభంగా చేసుకోవచ్చు ముందుగా ఒక గాజు పాత్ర తీసుకోవాలి. ఆ పాత్రలో ఒకటిన్నర టీస్పూన్ టీ పొడి వేయాలి. దానితోపాటు దాల్చినచెక్క, లవంగాలు, ఆవ నూనె, కొద్దిగా నీరు కలపాలి. ఈ మిశ్రమం సిద్ధమైన తర్వాత జాడీ మూతకు రంధ్రం చేసి దానిలో పొడవైన దూది వత్తిని అమర్చాలి. వత్తి యొక్క ఒక చివర మిశ్రమంలో మునిగి ఉండేలా పైభాగం బయటికి వచ్చేలా చూడాలి. ఇప్పుడు దీనిని దీపం లేదా కొవ్వొత్తిలా వెలిగించి ఇంట్లో ఉంచాలి.
ఇది కూడా చదవండి: తక్కువ షుగర్‌తో ఎక్కువ లాభాలు..? టీలో ఈ ఒక్కటి మిస్ చేసి తాగడం ఎలాగో తెలుసుకోండి!!
ఈ దీపం వెలిగించడం వల్ల దోమలు(mosquito) ఇంటి నుంచి పూర్తిగా మాయమవుతాయి. దీనిని ఇంటి లోపల, బయట కూడా ఉపయోగించవచ్చు. దోమలకు లవంగాలు, దాల్చినచెక్క వాసన అస్సలు నచ్చదు, అందుకే వాటికి దూరంగా ఉంటాయి. ముఖ్యంగా దాల్చినచెక్క నూనెలో ఉండే సిన్నమాల్డిహైడ్ అనే రసాయనం దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆవ నూనె ఘాటైన వాసన కూడా దోమలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ సహజమైన దీపం వెలిగించినప్పుడు ఆ పొగ దోమలకు నష్టం కలిగించకుండా వాటిని తరిమికొడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: డార్క్ ప్రైవేట్ పార్ట్స్‌ను శుభ్రం చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? వైద్యుల సలహాలు చూడండి!!
Follow Us