/rtv/media/media_files/2025/11/05/instant-sleep-2025-11-05-18-35-46.jpg)
Instant Sleep
నేటి వేగవంతమైన జీవనశైలి కారణంగా చాలా మంది నిద్రలేమి (Insomnia) సమస్యతో బాధపడుతున్నారు. రాత్రంతా మంచం మీద అటూఇటూ దొర్లుతూ, నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల పగలంతా అలసటగా ఉండటం, త్వరగా వృద్ధాప్యం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. తీవ్రమైన ఒత్తిడి, జీవనశైలి మార్పులు నిద్రలేమికి ప్రధాన కారణాలు. అయితే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు శరీరంలోని కొన్ని భాగాలను నొక్కడం ద్వారా త్వరగా నిద్రలోకి జారుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రను ప్రేరేపించడానికి ఉపయోగపడే ఆ నాలుగు ముఖ్యమైన పాయింట్లు, వాటిని ఎలా నొక్కాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
రాత్రంతా హాయిగా నిద్రపోవాలంటే...
చెవి వెనుక భాగం: ఆందోళన, తలనొప్పి కారణంగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నట్లయితే.. చెవి వెనుక, చెవి తమ్మెకు కొద్దిగా వెనక ఉండే ప్రాంతాన్ని మెల్లగా నొక్కాలి. ఈ పాయింట్‌ను ఆన్మియన్ (Anmian) అని అంటారు. ఈ ప్రాంతాన్ని సుమారు 10 నుంచి 20 సార్లు మృదువుగా నొక్కడం వల్ల హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
కనుబొమ్మల మధ్య భాగం: కొన్నిసార్లు అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి కూడా నిద్రలేమికి దారితీయవచ్చు. అటువంటి సందర్భాలలో.. కనుబొమ్మల మధ్య, నుదుటిపైన ఉన్న పాయింట్‌ను మెల్లగా నొక్కాలి. ఈ పాయింట్‌ను నొక్కడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది, త్వరగా నిద్రలోకి జారుకుంటారు.
ఇది కూడా చదవండి: ఎక్కువ కాలం బతకాలని ఉందా..? అయితే.. వెంటనే ఈ 10 అలవాట్లు మార్చుకోండి!!
మెడ కింది భాగం: సాధారణంగా మసాజ్ చేసేటప్పుడు మెడపై స్ట్రోక్ చేసినప్పుడు నిద్ర వచ్చిన భావన కలుగుతుంది. ఎందుకంటే మెడ పైభాగంలో ఒక నిర్దిష్ట పాయింట్ ఉంది. ఈ పాయింట్‌ను బొటనవేలితో నొక్కినప్పుడు తక్షణ ఉపశమనం లభించి నిద్ర వస్తుంది. దీన్ని రిలాక్సేషన్ పాయింట్ అని కూడా అంటారు.
చేతులపై పాయింట్లు: నిద్రను ప్రేరేపించే పాయింట్లు చేతి వేళ్లపై కూడా ఉంటాయి. అరచేతి నుంచి మణికట్టు వరకు వేళ్లను చాపి.. ఆ ప్రాంతాన్ని మెల్లగా నొక్కాలి. ఈ పాయింట్లు నాడీ వ్యవస్థను (Nervous system) రిలాక్స్ చేస్తాయి. దీనివల్ల త్వరగా నిద్ర పట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: బెల్లంతో టీ పెట్టొచ్చు.. అది ఎలా అంటారా..? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి!!
Follow Us