/rtv/media/media_files/2025/10/06/yellow-wasps-2025-10-06-10-11-00.jpg)
Yellow Wasps
ఇంట్లో లేదా చుట్టుపక్కల కందిరీగలు (Yellow Wasps) గూళ్లు కడితే వెంటనే తొలగించడం చాలా అవసరం. కందిరీగల కాటు చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ గూళ్లను తొలగించడానికి ఖరీదైన స్ప్రేలు కొనాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే సులభంగా స్ప్రే తయారు చేసుకోవచ్చు. ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ చిట్కా గూడు ఏర్పడటం ప్రారంభించినప్పుడు మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుంది. గూడు పెద్దగా పెరిగితే.. దానిని తొలగించడం కష్టం. అయితే ఈ సులభమైన పరిష్కారాన్ని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
స్ప్రే తయారీకి కావలసిన పదార్థాలు:
రెండు గ్లాసుల నీరు, రెండు టీస్పూన్ల డెట్టాల్ (Dettol), షాంపు లేదా డిటర్జెంట్.. లిక్విడ్ డిష్‌వాషింగ్ లిక్విడ్ కూడా వాడవచ్చు. ఖాళీ స్ప్రే బాటిల్ అవసరం ఉంటుంది. ముందుగా ఖాళీ స్ప్రే బాటిల్‌లో నీరు, డెట్టాల్, రెండు రూపాయల షాంపు ప్యాకెట్‌ను వేయాలి. బాటిల్ మూత గట్టిగా పెట్టి.. బాగా కలిపి నురుగు వచ్చేంత వరకు షేక్ చేయాలి. కందిరీగలు తక్కువ చురుకుగా ఉండే సమయాల్లో అంటే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే ఈ పని చేయాలి. స్ప్రే ఉపయోగించే ముందు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు, ముఖానికి మాస్క్ లేదా గుడ్డ, కళ్లకు గాగుల్స్ తప్పనిసరిగా ధరించాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఖరీదైన ఫేషియల్స్‌తో పనిలేదు..ఇంట్లోనే ముఖం మెరిపించే సులభ చిట్కాలు
తయారు చేసిన ద్రవాన్ని దూరం నుంచే కందిరీగల గూడుపై స్ప్రే చేయాలి. ఈ ద్రవం కందిరీగల రెక్కలను తడిపి, నురుగు వాటిని ఎగరనీయకుండా చేస్తుంది. దీంతో అవి తాత్కాలికంగా కదలకుండా నిలిచిపోతాయి. కందిరీగలన్నీ కదలకుండా నిలిచిపోయిన తర్వాత పొడవాటి కర్ర లేదా చీపురు ఉపయోగించి గూడును సున్నితంగా కింద పడేయాలి. గూడును తొలగించిన తర్వాత దానిని చెత్తబుట్టలో పారవేయండి. కందిరీగలు మళ్లీ అక్కడే గూడు కట్టకుండా నిరోధించడానికి గూడు ఉన్న ప్రాంతంలో మళ్లీ స్ప్రే ద్రవంతో శుభ్రం చేయాలి. ఈ సులువైన ఇంటి చిట్కా ద్వారా కందిరీగల గూళ్లను సురక్షితంగా తొలగించవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఈ సమస్య నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: స్నానం చేసేటప్పుడు ఈ శరీర భాగాలపై సబ్బు వాడకూడదా..? వచ్చే దుష్ప్రభావాలు ఇవే