/rtv/media/media_files/2025/10/09/colds-and-coughs-in-children-2025-10-09-10-54-09.jpg)
colds and coughs
జలుబు, దగ్గు అనేది సాధారణంగా వైద్యం లేకుండానే కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. అయినప్పటికీ చిన్నపిల్లలకు వచ్చే ఇబ్బందికరమైన లక్షణాలు తల్లిదండ్రులను కలవరపరుస్తాయి. ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ఓవర్-ది-కౌంటర్ మందులు (OTC) సురక్షితం కాదు. తప్పుగా ఉపయోగిస్తే తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీయవచ్చు. అందుకే నిపుణులు సురక్షితమైన, సంప్రదాయ ఇంటి నివారణలను (Home Remedies) పాటించాలని సూచిస్తున్నారు. చిన్నారులకు ఉపశమనం కలిగించే సులభమైన చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఇంటి చిట్కాలు:
ఉప్పునీటితో పుక్కిలించడం: రెండు సంవత్సరాలు పైబడిన పిల్లలకు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు కలిపి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
సెలైన్ నాసల్ స్ప్రే: ముక్కులో గట్టిపడిన శ్లేష్మాన్ని తొలగించడానికి సెలైన్ నాసల్ స్ప్రే అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లోనే నాన్-అయోడైజ్డ్ ఉప్పును నీటిలో కలిపి తయారు చేసుకోవచ్చు. పసిబిడ్డలకు నాసల్ బల్బ్ సిరంజి ఉపయోగించి శుభ్రం చేయవచ్చు.
ఆవిరి పీల్చడం (Steam): రాత్రి పడుకునే ముందు ఆవిరి పట్టడం ద్వారా ముక్కు దిబ్బడ తగ్గుతుంది. ఆరు సంవత్సరాలు పైబడిన పిల్లలకు యూకలిప్టస్ వంటి నూనెలు కలిపిన ఆవిరి మంచిది. చిన్న పిల్లల కోసం, బాత్రూమ్‌లో వేడి నీటి స్నానం చేసి, ఆ గదిలో 15 నిమిషాలు కూర్చుంటే ఉపశమనం లభిస్తుంది.
పసుపు కలిపిన పాలు: పాలు విటమిన్ డిని, పసుపు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. పాలు తాగే అన్ని వయసుల వారికి ఇది అద్భుతమైన ఔషధం.
ఇది కూడా చదవండి: నోరూరించే రసం ఉప్మా ఎలా చేయాలో తెలుసుకోండి
తేనె (Honey): తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం దగ్గును తగ్గిస్తుంది. పెద్ద పిల్లలు దీనికి కొద్దిగా అల్లం, తులసి పేస్ట్ కలుపుకోవచ్చు. ఒక సంవత్సరం లోపు పిల్లలకు తేనె ఇవ్వకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అల్లం (Ginger): అల్లం సహజమైన యాంటీ వైరల్, డీకంజెస్టెంట్‌గా పనిచేస్తుంది. ఒక సంవత్సరం పైబడిన పిల్లలకు అల్లం టీ ఇవ్వవచ్చు లేదా పసితనం నుంచే కిచిడీ వంటి ఆహారంలో అల్లం, వెల్లుల్లిని జోడించవచ్చు.
వాము(Vamu): వాము యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి.. ఛాతిలో బిగుతును తగ్గిస్తుంది. వాము, రెండు వెల్లుల్లి రెబ్బలను వేయించి, చిన్న ముస్లిన్ గుడ్డలో పోట్లిలా కట్టి బిడ్డ పక్కన ఉంచడం వల్ల వచ్చే ఆవిరి ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది.
గోరువెచ్చని నూనె మసాజ్: ఆయుర్వేదంలో ఇది అత్యుత్తమ నివారణ. ఆవాల నూనెలో వెల్లుల్లి, కలోంజి (Kalonji) గింజలు వేసి వేడి చేసి, ఛాతి, వీపు, అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఇటువంటి సురక్షితమైన, సాంప్రదాయ పద్ధతులను పాటించడం ద్వారా బిడ్డ అసౌకర్యాన్ని తగ్గించి త్వరగా కోలుకునేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ చిన్న పని చేస్తే 13 రకాల క్యాన్సర్లు పరార్.. అదేంటో తెలుసా?