Health Tips: ఈ చిన్న పని చేస్తే 13 రకాల క్యాన్సర్లు పరార్.. అదేంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ముప్పు రోజురోజుకు పెరుగుతోంది. 13 రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందేందుకు రోజూ 7 వేల అడుగులు నడిచిన వారిలో క్యాన్సర్ ప్రమాదం ఏకంగా 11 శాతం తగ్గింది. 9 వేల అడుగులు నడిచిన వారిలో ఈ శాతం 16కి చేరినట్లు అధ్యయనంలో తేలింది.

New Update
walking and Cancer

walking and Cancer

ప్రస్తుత జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ముప్పు రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 13 రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ పొందేందుకు నిపుణులు కొన్ని ముఖ్యమైన చిట్కాలను సూచిస్తున్నారు. వీటిలో అత్యంత ప్రభావవంతమైనది రోజువారీ నడక అని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ కీలక అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారించింది. సుమారు 85 వేల మంది యువకులను ఈ అధ్యయనంలో భాగం చేసి.. వారి కార్యకలాపాలను ఆక్సెలరోమీటర్ల ద్వారా ఆరు సంవత్సరాలు పర్యవేక్షించారు. ఈ పరిశీలనలో ఎంత ఎక్కువగా నడిస్తే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంత తగ్గుతుందని స్పష్టమైంది.

నడకతో క్యాన్సర్ ముప్పుకు చెక్..

అధ్యయనం కాలంలో 2,600 మందిలో కనీసం ఓ రకం క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. అయితే వారు తమ నడకను పెంచినప్పుడు వారిలో పెద్ద మార్పు కనిపించింది. రోజూ 7 వేల అడుగులు నడిచిన వారిలో క్యాన్సర్ ప్రమాదం ఏకంగా 11 శాతం తగ్గింది. అదే సమయంలో 9 వేల అడుగులు నడిచిన వారిలో ఈ శాతం 16కి చేరినట్లు అధ్యయనంలో తేలింది. ఆశ్చర్యకరంగా ఈ అధ్యయనం ప్రకారం.. నడక వేగం కంటే.. మీరు వేసే మొత్తం అడుగులే క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు తెలిపారు. అంటే వేగంగా నడవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చయినా.. మొత్తం అడుగుల సంఖ్యే ఎక్కువ ప్రయోజనాన్ని అందించింది.

ఇది కూడా చదవండి: ఉదయం ఖాళీ కడుపుతో ఏం తింటే మంచిదో తెలుసా...?

ఈ అధ్యయనంలో ప్రస్తావించిన 13 రకాల క్యాన్సర్లలో బ్లాడర్ (మూత్రాశయం), రొమ్ము, పెద్దపేగు, ఎండోమెట్రియల్ (గర్భాశయం), అన్నవాహిక, కిడ్నీ (మూత్రపిండాలు), కాలేయం, ఊపిరితిత్తులు, కడుపు, పురీషనాళం క్యాన్సర్‌లు ఉన్నాయి. వీటితోపాటు లుకేమియా, మైలోమా, తల, మెడ క్యాన్సర్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజువారీ నడకను అలవాటు చేసుకుని క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 
ఇది కూడా చదవండి: ఏసీలో కూర్చొని పని చేసే వారికి షాకింగ్ న్యూస్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Advertisment
తాజా కథనాలు