/rtv/media/media_files/2025/12/05/male-fertility-2025-12-05-12-49-03.jpg)
Male Fertility
నేటికాలంలో పండుగలు, వేడుకలు లేదా రోజువారీ కోరికల పేరుతో మనం ఎక్కువగా తీసుకునే తీపి పదార్థాలు, ప్యాక్ చేసిన స్వీట్లు, ముఖ్యంగా చక్కెర పానీయాలు కేవలం బరువు పెంచడానికే కాకుండా పురుషుల సంతానోత్పత్తి (Male Fertility)పై కూడా తీవ్రమైన, గుర్తించదగిన ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక చక్కెర వినియోగం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గడం.. వాటి చలనశీలత (Motility) బలహీనపడటం, హార్మోన్ల అసమతుల్యత, DNA డ్యామేజ్ వంటి సమస్యలు తలెత్తుతాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పురుషులు తమ పునరుత్పత్తి ఆరోగ్యంపై చక్కెర పాత్ర ఎంత లోతుగా ఉంటుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చక్కెర-స్పెర్మ్:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక చక్కెర ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలు వేగంగా పెరిగి కాలక్రమేణా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుంది. ఈ అసమతుల్యత ఆక్సీకరణ ఒత్తిడిని (Oxidative Stress) ప్రేరేపిస్తుంది. ఈ స్థితిలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ కణాలు.. ముఖ్యంగా వృషణాలలో స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసే సున్నితమైన కణాలను దెబ్బతీస్తాయి. ఈ నష్టం పురుషుల సంతానోత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ప్రభావం చూపుతుంది.
స్పెర్మ్ గాఢత తగ్గింపు:
క్రమం తప్పకుండా అధిక చక్కెర ఆహారం తీసుకునే పురుషులలో స్పెర్మ్ సంఖ్య, మొత్తం వీర్యం నాణ్యత తగ్గుతుంది. అంతేకాకుండా స్పెర్మ్ కణాలు అండాన్ని చేరుకోవడానికి అవసరమైన వేగం, కదలిక సామర్థ్యం దెబ్బతింటుంది. డాక్టర్ల ప్రకారం.. చక్కెర వినియోగం ఊబకాయానికి దారితీస్తుంది. ఇది పురుషులలో వంధ్యత్వానికి ముఖ్యమైన ప్రమాద కారకంగా మారుతుంది. ఊబకాయం, అధిక ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడానికి దారితీస్తుంది.. ఇది ఆరోగ్యకరమైన స్పెర్మ్ అభివృద్ధికి అత్యవసరం.
ఇది కూడా చదవండి: ఉప్పు వినియోగం తగ్గించండి.. ఆరోగ్యాన్ని ముప్పు నుంచి తప్పించండి
స్పెర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్:
ఊబకాయం స్పెర్మ్ DNA విచ్ఛిన్నం (Fragmentation) పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. దెబ్బతిన్న DNA ఫలదీకరణంపై ప్రభావం చూపుతుంది. గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది, పిండం యొక్క సాధారణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. అయితే స్పెర్మ్ DNA దెబ్బతినడం భవిష్యత్ తరంలో పిల్లలకు జీవక్రియ లేదా అభివృద్ధి సమస్యలను కలిగించే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అధిక చక్కెర కేవలం కేలరీల సమస్య మాత్రమే కాదు.. పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి ప్రత్యక్ష ముప్పు అని నిపుణులు చెబుతున్నారు.
పండుగల సీజన్లలో జాగ్రత్త:
పండుగల సీజన్లలో ఉండే అధిక తీపి అలవాట్లపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ చక్కెర తీసుకోవడం వలన గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలు వేగంగా పెరిగి.. వాపు (Inflammation), ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుంది. ఈ కారకాలు స్పెర్మ్ చలనశీలతను బలహీనపరుస్తాయి, DNA సమగ్రతకు నష్టం కలిగిస్తాయని అంటున్నారు. పండుగల సమయంలో అప్పుడప్పుడు స్వీట్లు తినడం సాధారణమే అయినప్పటికీ.. దీర్ఘకాలికంగా అధికంగా చక్కెర వినియోగించడం స్పెర్మ్ ఆరోగ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది.
ఆచరణాత్మక పరిష్కారం:
చక్కెర వల్ల కలిగే నష్టం శాశ్వతం కాదు. జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా స్పెర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. చక్కెర పదార్థాలను తగ్గించి.. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ను నివారించడానికి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, నట్స్ (అక్రోట్, గుమ్మడి గింజలు వంటివి) వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా శారీరక శ్రమ, సరైన నిద్ర జీవక్రియ స్థిరత్వాన్ని (Metabolic Stability) స్పెర్మ్ నాణ్యతను పెంచడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలను, మొత్తం పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. అయితే వృషణాలు వేడెక్కకుండా నిరోధించడానికి వదులుగా ఉండే లోదుస్తులు ధరించడం స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. పురుషులు తమ ఆహార ఎంపికల విషయంలో అవగాహనతో, సంయమనంతో ఉండటం ద్వారా సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు మీ ఒంటిలో కనిపిస్తే మీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లే!!
Follow Us