/rtv/media/media_files/2025/12/05/salt-2025-12-05-11-38-04.jpg)
salt
ఉప్పు అనేది మన ఆహారంలో అత్యంత ముఖ్యమైన, సర్వసాధారణమైన పదార్థం. ఇది రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా.. శరీరానికి కూడా అత్యవసరం. సోడియం, క్లోరైడ్ అయాన్లు శరీరంలో ద్రవ సమతుల్యతను (Fluid Balance) నిర్వహించడానికి.. నరాల సంకేతాలను (Nerve Signals) ప్రసారం చేయడానికి, కండరాల పనితీరుకు తోడ్పడతాయి. అయితే.. దీని అధిక వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరం. అయితే రోజువారీ ఆహారంలో మనం తెలియకుండానే తీసుకునే అధిక సోడియం ప్రమాదంపై కార్డియాలజిస్టులు గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన రోజువారీ పరిమితి 2000 mg సోడియం (సుమారు 5 గ్రాములు లేదా 1 టీస్పూన్ ఉప్పు) కాగా ప్రపంచవ్యాప్తంగా వయోజనులు సగటున 4310 mg సోడియం తీసుకుంటున్నారు. ఇది సిఫార్సు చేసిన పరిమితి కంటే రెట్టింపు కంటే ఎక్కువ. కార్డియాలజిస్ట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక సోడియం స్థాయిలు రక్తపోటును పెంచుతాయి. ఇది గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రోజువారీగా మనం తినే అనేక భారతీయ ఆహారాలలో ఈ దాగి ఉన్న ఉప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.
హై-సోడియం భారతీయ ఆహారాలు:
అధిక రక్తపోటును (Hypertension) సమర్థవంతంగా నిర్వహించడానికి తప్పక నివారించాల్సిన 7 హై-సోడియం భారతీయ ఆహారాల జాబితా ఇక్కడ ఉంది. వైద్యులు హెచ్చరించిన 7 హై-సోడియం భారతీయ ఆహారాలు అధిక రక్తపోటు ఉన్నవారు, ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ఆహారాల వినియోగాన్ని పరిమితం చేయాలి.
ఊరగాయ: నిల్వ కోసం ఉప్పును ప్రధాన సంరక్షణకారి (Preservative)గా ఉపయోగిస్తారు. ఒక టేబుల్‌స్పూన్ కూడా రోజువారీ సోడియం పరిమితిలో పెద్ద భాగాన్ని చేరవచ్చు. ఇది రక్తపోటును పెంచుతుంది.
పాపడ్: రుచి, నిల్వ కోసం అధిక సోడియం, సంకలితాలు (Additives) ఉంటాయి. తరచుగా భోజనంలో తీసుకోవడం వల్ల అనవసరమైన ఉప్పు శరీరంలో చేరి.. రక్తపోటు పెరుగుతుంది, నీరు నిలుపుదల (Water Retention)కి దారితీస్తుంది.
ఇన్‌స్టంట్ నూడుల్స్ రుచిని పెంచే ప్యాకెట్‌లు (Taste Maker) అధిక మొత్తంలో ఉప్పు, ఫ్లేవర్ ఎన్హాన్సర్‌లతో నిండి ఉంటాయి. ఒక సర్వింగ్ కూడా రోజువారీ సిఫార్సు చేసిన సోడియం పరిమితిని మించిపోయే అవకాశం ఉంది.
నమ్‌కీన్- చిప్స్: భుజియా, మిక్చర్, బంగాళాదుంప చిప్స్ వంటి ప్యాకెట్ స్నాక్స్‌లో రుచి, షెల్ఫ్ లైఫ్ కోసం ఉప్పు ఎక్కువగా ఉంటుంది. తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఉబ్బరం (Bloating) రక్తపోటు పెరుగుతాయి.
రెడీ-టు-ఈట్ గ్రేవీలు & సూప్‌లు: సౌలభ్యం కోసం తయారుచేసినప్పటికీ... నిల్వ చేయడానికి ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా వాడటం వల్ల సోడియం వినియోగం పెరిగి.. రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది.
బ్రెడ్ లేదా పేస్ట్రీ: బేకర్ ఉత్పత్తులలో కూడా దాగి ఉన్న సోడియం ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల సోడియం వినియోగం సురక్షిత పరిమితిని దాటుతుంది.
సాస్‌లు-కెచప్‌లు: సోయా సాస్, కెచప్, బార్బెక్యూ సాస్ వంటి వాటిలో సోడియం స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచుగా భోజనంలో వాడినప్పుడు మొత్తం ఉప్పు వినియోగానికి గణనీయంగా దోహదపడతాయి.
అధిక సోడియం వల్ల అనారోగ్య సమస్యలు:
సోడియం ద్రవ సమతుల్యత (Fluid Balance), కండరాల పనితీరుకు అవసరం అయినప్పటికీ.. దాని అధిక వినియోగం శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
అధిక రక్తపోటు:
ఎక్కువ ఉప్పు తినడం వలన రక్తనాళాలలో రక్త పరిమాణం పెరిగి.. రక్తపోటు పెరుగుతుంది. రోజుకు 6 మి.గ్రా కంటే తక్కువ ఉప్పు తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అంతేకాకుండా అధిక ఉప్పు గుండె చుట్టూ నీరు చేరేలా చేస్తుంది.. ఇది గుండె, ఊపిరితిత్తులపై భారం పెంచుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉప్పు మూత్రపిండాలపై ఒత్తిడి పెంచి.. ద్రవాన్ని నిలుపుకునేలా చేస్తుంది. ఇది వాపు (Edema), బరువు పెరగడానికి దారితీస్తుంది. అంతకాకుండా మధుమేహం సమస్యలు ఇది నేరుగా బ్లడ్ షుగర్‌తో సంబంధం లేనప్పటికీ.. అధిక సోడియం మధుమేహ వ్యాధిగ్రస్తులలో మూత్రపిండాల సమస్యల నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తుంది.
ఇంకా తరచుగా తలనొప్పి, గుండె కండరాలు పెరగడం, బోలు ఎముకల వ్యాధి (Osteoporosis) కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు కూడా అధిక సోడియం వినియోగంతో ముడిపడి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
సోడియం వినియోగాన్ని ఎలా తగ్గించుకోవాలి?
ఇతర నిపుణులు రుచిని కోల్పోకుండా ఉప్పు వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు సూచించారు. వాటిల్లో వంట చేసేటప్పుడు ఉప్పు వేయకుండా.. వడ్డించిన తర్వాత కొద్దిగా ఉప్పును చల్లుకోవాలి. ఉప్పుకు బదులుగా నిమ్మరసం, చింతపండు, అల్లం, వెల్లుల్లి, వెనిగర్, మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి రుచిని పెంచాలి. అయితే తాజా పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, ఇంట్లో వండిన ఆహారాలు సహజంగా సోడియం తక్కువగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన, ప్యాకెట్, ఘనీభవించిన (Frozen) ఆహారాలను నివారించాలి.
ఇది కూడా చదవండి: ఉదయం ఈ దినచర్యలు బెస్ట్..? మానసిక స్థితి మెరుగు కోసం 6 సులభ అలవాట్లు మీ కోసం!!
చిప్స్, నమ్‌కీన్‌లకు బదులుగా ఉప్పు లేని నట్స్, వేయించిన శెనగలు, పండ్లు లేదా ఇంట్లో తయారుచేసిన స్నాక్స్‌ను ఎంచుకోవాలి. ఇంకా ప్యాకెట్ చేసిన ఉత్పత్తులపై సోడియం స్థాయిలను తప్పకుండా తనిఖీ చేయాలి. ప్రతి సర్వింగ్‌కు రోజువారీ సిఫార్సు చేసిన సోడియంలో 30% కంటే ఎక్కువ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. తక్కువ సోడియం ఉన్న పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి. రెస్టారెంట్‌లలో అదనపు ఉప్పు లేదా MSG (మోనోసోడియం గ్లుటామేట్) వేయవద్దని అడగాలి. తక్కువ సోడియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన అధిక రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించవచ్చు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు, అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ మార్పులను ఈరోజే మీ ఆహారంలో చేర్చుకోవడం .. ఆరోగ్యకరమైన జీవితానికి మేలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చలికాలం వ్యాయామాలు.. ఎన్నో ఉపయోగాలు.. మీరు కూడా తెలుసుకోండి అవేంటో!!
Follow Us