/rtv/media/media_files/2025/06/21/women-yoga-asanas-2025-06-21-17-18-03.jpg)
Yoga
ఈ రోజుల్లో ఒత్తిడికి గురై చాలా మంది అనారోగ్య సమస్యల(health-problems) బారిన పడుతున్నారు. నిజానికి అన్ని అనారోగ్య సమస్యలకు ఏదైనా ముఖ్య కారణం ఉందంటే.. అది ఒత్తిడి(stress) మాత్రమే. కుటుంబ బాధత్యలు, వర్క్ ప్రెషర్, మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి కారణాల వల్ల కొందరు ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఒత్తిడి అధికమైతే రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, కీడ్నీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత ఆరోగ్యమైన ఫుడ్(healthy-food) తీసుకున్నా కూడా ఒత్తిడి తప్పకుండా అనారోగ్యం పాడవుతుంది. మీ ఆరోగ్యానికి ఇదే అతిపెద్ద శత్రువు. అయితే ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే ఉదయాన్నే పాటించాల్సిన టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read : పండ్లు ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినొద్దు?
ధ్యానం
ఒత్తిడి నుంచి బయటపడటానికి ముఖ్యంగా చేయాల్సింది.. ధ్యానం. డైలీ ఒక పది నిమిషాలు లేదా గంట పాటు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. ధ్యానం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది. అయితే రోజులో ఏ సమయంలో అయినా ధ్యానం చేయడం మంచిదే.. కానీ ఉదయం పూట చేసే ధ్యానం ఇంకా మంచిది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఒక గంట పాటు ధ్యానం చేస్తే.. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా క్లియర్ అవుతాయి. మనస్సులో ఉన్న ప్రతికూల ఆలోచనలు అన్ని కూడా తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు.
శ్వాస తీసుకుంటూ..
ఒత్తిడికి సహజంగా గురవుతుంటారు. అయితే సరైన పద్ధతిలో శ్వాస తీసుకుంటేనే ఒత్తిడి నుంచి బయటపడతారని నిపుణులు అంటున్నారు. బాగా ఒత్తిడికి గురవుతుంటే కనీసం 5 నిమిషాలు ఆలోచించకుండా లోతైన శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా ఇలా లోతైన శ్వాస తీసుకుంటే ఒత్తిడి తగ్గడంతో పాటు అధిక రక్తపోటు కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లోతుగా శ్వాస తీసుకుంటే ఒత్తిడి తగ్గి బాడీ కూడా యాక్టివ్ అవుతుందని అంటున్నారు.
వ్యాయామం
ధ్యానంతో పాటు వ్యాయామం(yoga) చేసినా ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. డైలీ ఉదయం ఒక అరగంట పాటు నడక, రన్నింగ్ వంటివి చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
యోగా
ఉదయం పూట యోగా చేస్తే ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. యోగా వల్ల ఒత్తిడి అంతా పోతుంది. ఉదయాన్నే చేయడం వల్ల మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.
నిద్ర
ఒత్తిడి తగ్గడానికి నిద్ర కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సరైన సమయానికి నిద్రపోయి లేస్తే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. డైలీ తప్పకుండా 8 గంటలు నిద్రపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు అయిన క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read : దసరా రోజు ఈ మొక్కని నాటితే.. మీ దరిద్రాలన్నీ పరార్.. తప్పక తెలుసుకోండి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.