/rtv/media/media_files/2025/03/27/8Ml2TKbBcgL5R2jXPKzG.jpg)
Water
నీరు లేకపోతే ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా బ్రతకదు. జంతువులు, మనుషులు ఇలా ప్రతీ ఒక్కరికి నీరు(water) జీవనాధరమైనది. చుక్క నీరు కోసం కొందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు(health-problems) ఉన్నా కూడా నీరుతో తగ్గించుకోవచ్చని కొందరు అంటుంటారు. ఎక్కువగా నీరు తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. దీంతో కొందరు తీసుకోవాల్సిన మోతాదులో కంటే అధిక మొత్తంలో వాటర్ తీసుకుంటారు. ఇలా ఎక్కువగా వాటర్ తాగడం వల్ల కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా కూడా ఎంత మోతాదులో తీసుకోవాలో అంతలోనే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంతకంటే తక్కువగా, ఎక్కువగా తీసుకున్నా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే అధిక మొత్తంలో వాటర్ తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Early Morning Health Tips: ఈ ఒక్క మిస్టేక్.. మీ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువు.. ఉదయాన్నే ఈ టిప్స్ పాటిస్తే సంజీవని అక్కర్లేదు!
అధికంగా వాటర్ తీసుకోవడం వల్ల..
అధికంగా వాటర్ తీసుకోవడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం భారీగా ఉబ్బుతుంది. కొన్నిసార్లు వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మాత్రమే కాదు.. తాగకపోవడం వల్ల కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. మోతాదుకు మించి వాటర్ తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, నీరసం, అలసట, తలనొప్పి(headache), పదే పదే మూత్రం రావడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిమిట్ వరకు మాత్రమే నీరు తీసుకుంటే ఇలాంటి లక్షణాలు కనిపించవని నిపుణులు అంటున్నారు. నిజానికి రోజుకు కేవలం 2.7 లీటర్ల నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని కంటే ఎక్కువగా నీరు తాగడం వల్ల నీటిలోని సోడియం గాఢత రక్తంలోకి చేరుతుంది. దీంతో కణజలాలు వాపుకు గురవుతాయి.
ఇది కూడా చూడండి: Rabies Risk: కుక్క కరిస్తేనే కాదు ఈ జంతువులు కరిచిన రెబిస్ వస్తుంది.. తెలుసుకొని జాగ్రత్త పడండి.
ఈ వాపు శరీరంతో పాటు మెదడులో కూడా ఏర్పడుతుంది. దీనివల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు ఎక్కువగా నీరు తాగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వ్యాయామం చేసేటప్పుడు చెమట ఎక్కువగా వస్తుంది. ఈ సమయంలో బాడీలో నీటి స్థాయిలు తగ్గకుండా ఉండేందుకు వారు వాటర్ తీసుకుంటారు. అలాగే పోలిడిప్సియా అనే మానసిక సమస్యతో బాధ పడేవారు కూడా ఎక్కువగా వాటర్ తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కూడా అధికంగా దాహం వేస్తుంది. దీంతో అధికంగా వాటర్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.