Rabies Risk: కుక్క కరిస్తేనే కాదు ఈ జంతువులు కరిచిన రెబిస్ వస్తుంది.. తెలుసుకొని జాగ్రత్త పడండి.

రేబిస్‌ను వ్యాప్తి చేయగల జంతువులను గుర్తించడం చాలా ముఖ్యం. కుక్కలతోపాటు గబ్బిలాలు, పెంపుడు పిల్లులు, వీధి పిల్లుల కాటు, గోకడం, కోతుల కాటు రేబిస్‌తోపాటు ఇతర అంటు వ్యాధులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Rabies Risk

Rabies Risk

రేబిస్ అనేది మెదడు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి కేవలం కుక్క కాటు ద్వారా మాత్రమే వస్తుందని చాలా మంది భావిస్తారు.. కానీ ఇది నిజం కాదు. కుక్కలతోపాటు అనేక ఇతర జంతువుల కాటు ద్వారా కూడా రేబిస్ సంక్రమించవచ్చు. సోకిన జంతువుల లాలాజలం లేదా కాట్లు, గోకడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రేబిస్ కుక్క కాటు వల్లనే కాదు.. ఇంకా ఏ జంతువుల కాటు వల్ల వస్తుందో కొన్ని విషయాలు ఆ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

రేబిస్ కుక్క కాటు వల్లనే కాదు..

రేబిస్‌ను వ్యాప్తి చేయగల జంతువులను గుర్తించడం చాలా ముఖ్యం. గబ్బిలాలు కూడా రేబిస్‌ను వ్యాపింపజేయగలవు. గబ్బిలాలు ఇంట్లోకి వస్తే వాటిని తాకకుండా ఉండాలి. వాటి దంతాలు చిన్నవిగా ఉండటం వలన కాటు గుర్తులు సులభంగా కనిపించవు. అందుకే చాలా మందికి తెలియకుండానే రేబిస్ బారిన పడే అవకాశం ఉంది. టీకాలు వేయని పెంపుడు పిల్లులు, వీధి పిల్లుల కాటు, గోకడం ద్వారా కూడా రేబిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కోతుల కాటు రేబిస్‌తోపాటు ఇతర అంటువ్యాధులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పొద్దున్నే ఇలా చేయండి.. మొటిమలు.. మచ్చలను తగ్గించుకోండి

ఆవులు, గేదెలు, గుర్రాలు వంటి పశువులు కూడా రేబిస్‌కు కారణం కావచ్చు. ఉడుతలు, కుందేళ్లు వంటి చిన్న జంతువుల కాటు కూడా ప్రమాదమే. ఈ జంతువులచే కరవబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అడవి జంతువుల కాటు ద్వారా కూడా రేబిస్ వచ్చే అవకాశం ఉంటుంది. జంతువు కాటు వేస్తే.. వెంటనే ఆ గాయాన్ని సబ్బు, పారే నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. తర్వాత గాయాన్ని బ్యాండేజ్‌తో కప్పి వెంటనే డాక్టర్‌ వద్దకు వెళ్లాలి. సకాలంలో సరైన చికిత్స ప్రాణాలను కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: బాదం ఆరోగ్యకరమే కానీ.. వాటితో తింటేనే ప్రమాదం!!

Advertisment
తాజా కథనాలు