Pregnancy Diet: గర్భధారణ సమయంలో ఈ ఆహారం తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం

గర్భధారణలో మెదడు వికాసానికి పోషకాహారం తినాలి. ఆరోగ్యకరమైన ఆహారాలైన చిలగడదుంపలు, బాదం, పెరుగు, గుడ్లు, కాయధాన్యాలు, చిక్కుళ్లు, వేరుశెనగ వంటివి డైట్‌లో చేర్చుకుంటే... బిడ్డ మెదడు ఎదుగుదలకు ఎంతో తోడ్పుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Pregnancy Diet

Pregnancy Diet

గర్భధారణ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం నేరుగా కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే గర్భధారణలో మెదడు వికాసానికి పోషకాహారం తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి  ఆరోగ్యకరమైన ఆహారాలు డైట్‌లో చేర్చుకుంటే... బిడ్డ మెదడు ఎదుగుదలకు ఎంతో తోడ్పుతుంది. ఈ ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

చిలగడదుంపలు:

చిలగడదుంపలు బీటా-కెరోటిన్, విటమిన్ ఎతో నిండి ఉంటాయి. ఇవి బిడ్డ మెదడు ఆరోగ్యానికి అత్యవసరం. కాబట్టి గర్భిణులు వీటిని తప్పకుండా తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.

బాదం:

బాదంలో విటమిన్ ఇ, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బిడ్డ మెదడు ఎదుగుదల మెరుగుపడుతుంది. బాదంను నానబెట్టి తినడం మంచిది. అయితే వీటిని ఎలా తీసుకోవాలో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

పెరుగు:

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు మంచివి. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రొటీన్లు, కాల్షియం తల్లి, బిడ్డ ఎముకలను బలంగా మారుస్తాయి. ప్రతి మహిళా గర్భధారణ ప్రయాణం భిన్నంగా ఉంటుంది కాబట్టి.. పెరుగును చేర్చుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించాలని గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి: ప్రోటీన్ స్మూతీతో 5 నిమిషాల్లో శరీరానికి కావలసిన శక్తి


గుడ్లు:

గుడ్లలో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ B12 సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ B12 బిడ్డ ఎముకలను దృఢం చేస్తుంది. గుడ్లు తినడం వల్ల నాడీ వ్యవస్థ, మెదడు వికాసం కూడా మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.

కాయధాన్యాలు, చిక్కుళ్లు:

గర్భిణులు కాయధాన్యాలు, చిక్కుళ్లను ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి బిడ్డ ఎదుగుదలకు చాలా అవసరం.

వేరుశెనగ:

వేరుశెనగలను స్నాక్‌గా తీసుకోవచ్చు. వీటిలో ప్రొటీన్, ఫోలేట్, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి బిడ్డ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నాజూకైన నడుము కోసం ఈ వ్యాయామాలు చేయండి

Advertisment
తాజా కథనాలు