/rtv/media/media_files/2025/09/22/waist-exercises-2025-09-22-14-38-57.jpg)
Waist exercises
నడుము శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది వెన్నెముకకు ఆధారాన్ని ఇస్తుంది. మనం నిటారుగా నిలబడటానికి.. కూర్చోవడానికి మరియు కదలడానికి సహాయపడుతుంది. బాన పొట్ట, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం కఠినమైన డైటింగ్‌ను అనుసరిస్తారు. అయితే డైటింగ్ చేయకుండానే పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి కొన్ని సులువైన వ్యాయామాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా చేయడం ద్వారా వేగంగా బరువు తగ్గడమే కాకుండా సన్నటి నడుమును కూడా సొంతం చేసుకోవచ్చు. ఆ వ్యాయామాలు వాటిని చేసే విధానం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మౌంటెన్ క్లైంబర్ ఎక్సర్సైజ్:
మౌంటెన్ క్లైంబర్ వ్యాయామం మొత్తం శరీరాన్ని చురుకుగా మారుస్తుంది. ఈ వ్యాయామం చేయడానికి నేలపై బోర్లా పడుకోవాలి. శరీరం బరువును చేతుల, పాదాలపై ఉంచి, శరీరాన్ని గాలిలో ఎత్తాలి. చేతులను ఒకే చోట స్థిరంగా ఉంచి, కాళ్లను కొండపైకి ఎక్కే విధంగా పరుగు తీస్తున్నట్లు ముందుకు వెనకకు కదిలించాలి. ఈ వ్యాయామం పొట్ట కొవ్వును వేగంగా కరిగిస్తుంది.
స్క్వాట్స్ ఎక్సర్సైజ్:
ప్రతిరోజూ ఉదయం స్క్వాట్స్ వ్యాయామం చేయడం వల్ల పొట్ట కొవ్వు తగ్గడమే కాకుండా.. తొడల కొవ్వు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా కాళ్లకు బలం చేకూరుతుంది. ఈ వ్యాయామం చేయడానికి కాళ్ల మధ్య కొంత దూరం ఉంచి నిలబడాలి. ఇప్పుడు ఒక కుర్చీలో కూర్చున్నట్లుగా గాలిలో సగం వరకు కూర్చుని మళ్లీ లేవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నడుము సన్నగా మారుతుంది.
ఇది కూడా చదవండి: అలారం సౌండ్‌తో హార్ట్ ఎటాక్.. తాజా రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!
ముఖ్యమైన చిట్కాలు:
ఈ వ్యాయామాలతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. వ్యాయామం చేసేటప్పుడు నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్ తినడం మానుకోవాలి. అలాగే చక్కెర వినియోగాన్ని తగ్గించాలి. బరువు తగ్గాలనుకునేవారు వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి ఉత్తమ మార్గం సమతుల్య ఆహారం కూడా ముఖ్యం. మంచి సమతుల్యమైన ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించాలి. అంతేకాకుండా నీరు ఎక్కువగా తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మంచి నిద్ర పోవడం కూడా శరీరానికి బాగా సహాయం చేస్తాయి. ఈ మార్పులను దినచర్యలో చేర్చుకోవడం వల్ల బరువును తగ్గించుకుని మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ మార్పులు నెమ్మదిగా ఫలితాలు చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా..? అయితే మీరు నిరాశలో మునిగినట్లే..!!