/rtv/media/media_files/2025/10/15/parenting-tips-2025-10-15-12-29-49.jpg)
Parenting Tips
ఇంట్లో పిల్లలు ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అయితే పిల్లలను ప్రేమించడం, వారి సంరక్షణ చూడటం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. అయితే కొన్నిసార్లు ఈ అధిక ప్రేమ, అప్యాయత పిల్లలను దారి తప్పేలా చేయవచ్చు. పిల్లలు చక్కగా పెరగాలంటే.. వారికి ప్రేమ, శ్రద్ధతోపాటు కొన్ని పరిమితులు విధించడం చాలా ముఖ్యం. మరి కొంతమంది పిల్లలు ఎంత ప్రేమ చూపినా దారి తప్పుతునే ఉంటారు. అయితే పిల్లలు చేసే అల్లరి తట్టుకోలేక కొందరూ తల్లిందడ్రులు తిట్టటం, కొట్టడం వల్ల పిల్లలు మెరుగు పడతారని అనుకుంటారు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా.. పేరెంటింగ్ నిజమైన మంత్రాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కొట్టకుండా పిల్లలను మెరుగుపరిచే చిట్కాలు:
పిల్లలు అడిగిన ప్రతిదానికి అవును అని చెప్పడం వలన వారి అంచనాలు విపరీతంగా పెరుగుతాయి. వారు ఒక కొత్త బొమ్మ అడగగానే మీరు వెంటనే తెచ్చిస్తే.. దేనికీ ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని వారు అర్థం చేసుకుంటారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో వారి సహనాన్ని తగ్గిస్తుంది. ఏదైనా సులభంగా దొరకనప్పుడు వారు చిరాకు పడటం లేదా మొండికేయడం ప్రారంభిస్తారు. ఇది జరగకూడదంటే.. కొన్నిసార్లు లేదని చెప్పడం అలవాటు చేసుకోవాలి. పిల్లలు అలిగినప్పుడు లేదా మొండికేసినప్పుడు, వారిని శాంతింపజేయడానికి వారి ప్రతి డిమాండ్‌కు తలొగ్గడం సరికాదు. మీరు ప్రేమతో ఇలా చేసినా.. పదేపదే ఇలా చేస్తే.. ఆ టెక్నిక్ పనిచేస్తుందని పిల్లలు గ్రహిస్తారు. మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తే తమ డిమాండ్లు తీరుతాయని వారు తెలుసుకుంటారు. ఇది వారి మొండితనాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఉదయం అలసిపోతున్నారా..? నిద్రను పాడుచేసే చెడు అలవాట్ల గురించి తెలుసుకోండి!!
పిల్లలకు భద్రతా భావం కలగాలంటే.. వారికి కొన్ని నియమాలు (Rules), పరిమితులు (Limits) విధించడం అవసరం. ఇలా చేయడం ద్వారా వారు మంచిగా ప్రవర్తించడం నేర్చుకుంటారు. ఎటువంటి పరిమితులు లేకుండా స్వేచ్ఛ ఇస్తే.. వారికి మంచి-చెడులను నేర్పించడం చాలా కష్టమవుతుంది. అంతేకాకుండా నియమాలు ఉన్నప్పుడు.. వారు మరింత మెరుగైన వ్యక్తులుగా ఎదుగుతారు. పిల్లలకు జీవితంలో బాధ్యతలు అప్పగించకపోవడం కూడా వారు దారి తప్పడానికి ఒక కారణం. వారికి ఎటువంటి బాధ్యత ఇవ్వకపోతే.. తమ పనులన్నీ మరొకరు చేస్తారని వారు భావిస్తారు. పిల్లలు భవిష్యత్తులో చెడిపోకూడదంటే.. వారికి చిన్న చిన్న పనుల బాధ్యతలను అప్పగించడం ప్రారంభించాలి. ఇంట్లో పనుల్లో సహాయం చేయమని అడగడం వంటివి ఇందులో ఉంటాయి. కొట్టడం, తిట్టడం కాకుండా, ప్రేమతో కూడిన కఠినత్వాన్ని (Firmness with Love) చూపించడం ద్వారా పిల్లల ప్రవర్తనలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రోజుకు శక్తినిచ్చే అద్భుతమైన పానీయాలు.. ఉదయాన్నే వీటిని తాగితే ఆరోగ్యమే ఆరోగ్యం!!