చలికాలంలో ఈ ఫుడ్ తింటే.. సమస్యలన్నీ పరార్
చలికాలంలో తెల్ల నువ్వులను డైలీ తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
చలికాలంలో తెల్ల నువ్వులను డైలీ తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
నువ్వులు వేడి స్వభావం కలిగి ఉంటాయి. చలికాలంలో వీటిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నువ్వులను తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్, హైబ్లడ్ షుగర్ అదుపులో ఉండటంతోపాటు ఎముకలు దృఢంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
నువ్వులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, పీచు, ప్రొటీన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. నువ్వుల నుంచి అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. నువ్వులతో రుచికరమైన, పోషకమైన వంటకాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.