TB Disease: దడ పుట్టిస్తున్న టీబీ... ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరి ఈ వ్యాధి.. నివేదికలో షాకింగ్ విషయాలు తెలుసుకోండి!!

ప్రపంచవ్యాప్తంగా క్షయ వ్యాధి కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. దక్షిణ-తూర్పు ఆసియాలో ఈ వ్యాధి ఎక్కువగా పెరుగుతుందని WHO నిపుణులు అంటున్నారు. ఇది ఊపిరితిత్తులతోపాటు మెదడు, వెన్నెముక, కిడ్నీలు, ఎముకలు, ఇతర శరీర భాగాలకు వ్యాపించవచ్చని హెచ్చరిస్తున్నారు.

New Update
TB Disease

TB Disease

TB Disease: నేటి కాలంలో టీబీ వ్యాధి అనేది ఇప్పటికీ దక్షిణ-తూర్పు ఆసియా ఆరోగ్య భద్రత, అభివృద్ధికి ఒక పెద్ద సవాలుగా ఉంది. ముఖ్యంగా పేద వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. నివారణ చర్యలు, ముందస్తు గుర్తింపు, త్వరిత చికిత్స, బలమైన ప్రాథమిక ఆరోగ్య మౌలిక సదుపాయాలు అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాల గురించి నిపుణులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన గ్లోబల్ ట్యూబర్‌కులోసిస్ రిపోర్ట్ 2025 దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతానికి సంబంధించిన ఆందోళనకరమైన వాస్తవాలను వెల్లడించింది. ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది మాత్రమే ఈ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే కొత్త TB (క్షయ) కేసుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కేసులు కేవలం ఇక్కడే నమోదవుతున్నాయి. TB వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని WHO ఆ నివేదికలో గట్టిగా పిలుపునిచ్చింది.

Also Read: ఇది కదా మాకు కావాల్సింది..! మాస్ డాన్స్‌తో దుమ్ముదులిపిన ‘రెబల్ సాబ్’

నివేదికలోని దడ పుట్టించే గణాంకాలు:

2024 సంవత్సరంలో సుమారు 10.7 మిలియన్ల మంది TB బారిన పడతారు, 12.3 లక్షల మంది మరణిస్తారని నివేధికలో తేలింది. కొత్త కేసుల్లో అత్యధికంగా భారత్‌లోనే నమోదవుతాయని అంచనా. దాదాపు 2.71 మిలియన్లు భారత్‌లో ఉండగా, ఆ తర్వాత బంగ్లాదేశ్ (3.84 లక్షలు), మయన్మార్ (2.63 లక్షలు), థాయిలాండ్ (1.04 లక్షలు), నేపాల్ (67 వేలు) ఉన్నాయని సర్వేలో చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని TB ఇన్సిడెన్స్ రేట్ (ప్రతి లక్ష జనాభాకు కొత్త కేసులు) 201గా ఉంది. ఇది ప్రపంచ సగటు 131 కంటే చాలా ఎక్కువ ఉంటుందని అంచన. దేశం, ఇన్సిడెన్స్ రేట్ ప్రతి లక్ష జనాభాకు  మయన్మార్, తిమోర్-లెస్టే,480 నుంచి 500 కేసులు, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, థాయిలాండ్146 నుంచి 269 కేసులు, శ్రీలంక, మాల్దీవులు తక్కువ కేసులు నమోదు అవుతుంది.

TB అంటే ఏమిటి..?

TB (ట్యూబర్‌కులోసిస్) అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. కానీ మెదడు, వెన్నెముక, కిడ్నీలు, ఎముకలు లేదా ఇతర శరీర భాగాలకు కూడా వ్యాపించవచ్చు. TB ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు.. తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలి ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

Also Read: బిగ్‌బాస్‌ మొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ?.. దీని అసలు కథ ఇదే

TB వ్యాధి సాధారణ లక్షణాలు:

సాధారణంగా ఈ లక్షణాలు రెండు వారాలకు మించి ఉంటే అనుమానించాలి. మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగే పొడి దగ్గు లేదా కఫంతో కూడిన దగ్గు, దగ్గుతున్నప్పుడు కఫంలో రక్తం పడటం, ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో వచ్చే తక్కువ-స్థాయి జ్వరం, రాత్రిపూట అధికంగా చెమటలు పట్టడం, కారణం లేకుండా బరువు కోల్పోవడం, ఆకలి మందగించడం, నిరంతరం అలసటగా, బలహీనంగా అనిపించడం, శ్వాస తీసుకున్నప్పుడు లేదా దగ్గినప్పుడు ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం వంటి లక్షణాలు ఉంటాయి. ఇతర భాగాలకు TB సోకినప్పుడు వచ్చే సమస్యలు ఉన్నాయి. వాటిల్లో మెదడు పొరల వాపు, ఎముకలు, కీళ్ల నొప్పి, శోషరస వంటి ఉంటాయి.

దక్షిణ-తూర్పు ఆసియా ముందున్న అతిపెద్ద సవాళ్లు:

దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతంలో TB వ్యాధి నిర్మూలనకు ప్రధాన అడ్డంకులు, సవాళ్లు ఉన్నాయి. ఇది ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఆందోళన. 2024లో దాదాపు 1.5 లక్షల కొత్త డ్రగ్-రెసిస్టెంట్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రకమైన TBకి ప్రామాణిక యాంటీ బయాటిక్స్ పనిచేయవు.. దీనికి చికిత్స క్లిష్టంగా ఉంటుంది. ఎక్కువ సమయం పడుతుంది, ఖరీదైనది. పేదరికం, బలహీనమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు TB నివారణ, చికిత్స సేవలను పేదలకు దూరం చేస్తున్నాయి. HIV సోకిన వ్యక్తుల్లో TB వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. వ్యాధి సోకిన వారిలో అందరినీ గుర్తించలేకపోవడం. అయినప్పటికీ.. బంగ్లాదేశ్, భారత్, థాయిలాండ్‌లలో కేస్ డిటెక్షన్ మెరుగైందని నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి: డంపింగ్ యార్డ్‌లతో కంపు కొడుతున్న పట్టణాలు..లక్షలు ఖర్చు చేసినా ఈ సమస్యకు లేని శాశ్వత పరిష్కారం

పురోగతి చికిత్స:

 2015 నుంచి దక్షిణ-తూర్పు ఆసియాలో TB ఇన్ఫెక్షన్ రేటులో 16 శాతం క్షీణత నమోదైంది. ఇది గ్లోబల్ సగటు 12 శాతం కంటే మెరుగైన పురోగతని వైద్యులు అంటున్నారు. చికిత్స కవరేజ్ 85 శాతం దాటింది. అంతేకాకుండా.. చికిత్స విజయవంతమయ్యే రేటు ప్రపంచంలోనే ఉత్తమంగా ఉందని నివేదిక తెలిపింది. HIV రోగులు, TB రోగులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులకు నివారణ చికిత్స అందించడం వేగవంతమైంది. TB చికిత్సకు నిర్దిష్ట కాలానికి యాంటీ బయాటిక్స్ కోర్సును తప్పనిసరిగా తీసుకోవాలి. చికిత్స వ్యవధి సాధారణంగా 6 నుంచి 9 నెలల వరకు ఉంటుంది. డ్రగ్-రెసిస్టెంట్ TB కి చికిత్స మరింత పొడిగించబడుతుంది, విభిన్న ఔషధాల కలయికను ఉపయోగించాల్సి ఉంటుంది. వైద్యులు సూచించిన పూర్తి కోర్సును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా వాడటం ముఖ్యం. మధ్యలో మందులు ఆపేస్తే TB బ్యాక్టీరియా మందులకు నిరోధకతను పెంచుకుని, డ్రగ్-రెసిస్టెంట్ TBగా మారే ప్రమాదం ఉంది.

TB నిర్మూలనకు తక్షణ చర్యలు:

దక్షిణ-తూర్పు ఆసియాలో TB మహమ్మారిని అరికట్టడానికి WHO క్రింది అంశాలపై వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. పేద, గ్రామీణ ప్రాంతాలకు సైతం TB పరీక్షలు, చికిత్స సేవలను సులభతరం చేయాలి. రోగ నిర్ధారణ గ్యాప్‌ను తగ్గించడం కోసం చురుకైన కేస్-ఫైండింగ్ (Active Case-Finding) పద్ధతులు ఉపయోగించాలి. TB రోగుల కుటుంబ సభ్యులకు, ఇతరులకు నివారణ చికిత్స అందించడాన్ని పెంచాలి. డ్రగ్ రెసిస్టెన్స్ పరీక్ష, చికిత్సను మరింత విస్తృతం చేయాలి. భారత్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలు కేవలం సంఖ్యాపరమైన పురోగతిపైనే కాకుండా.. TB రోగుల మరణాలను మరింత వేగంగా తగ్గించడానికి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన చికిత్స అందుబాటులో ఉండేలా చూడడానికి తమ ఆరోగ్య విధానాలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో ఎక్కువగా గుండె పోటు రావడానికి కారణం ఏంటి..? వచ్చే సమయంలో కనిపించే లక్షణాలు.. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Advertisment
తాజా కథనాలు