/rtv/media/media_files/2025/11/24/bigboss-2025-11-24-16-26-02.jpg)
Bigg Boss
Bigg Boss: బిగ్‌బాస్.. ఈ షో గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా యువతీ,యువకులు దీన్ని ఎక్కువగా చూస్తారు. సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్నవాళ్లు, మరికొందరు సినీ, సీరియల్ నటులు కలిసి దాదాపు 90 రోజుల పాటు ఓ హౌస్‌లో ఉంటారు. ఈ ప్రొగ్రామ్‌లో భాగంగా వాళ్లు పలు గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. అలాగే ఒకరినొకరు గొడవపడటం, తిట్టుకోవడం అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. దీనివల్లే ఈ షోకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. కంటెస్టెంట్లు చూపించే ఎమోషన్లు వీక్షకులను కూడా ఆకట్టుకుంటాయి. కొంతమంది ఈ షోను ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తారు, మరికొందరు వాళ్ల గొడవ పడితే చూసేందుకు ఇష్టపడుతుంటారు.
కంటెస్టెంట్లు గొడవలు పడ్డప్పుడల్లా టీవీల TRP రేటింగ్‌లు అమాంతం పెరిగిపోతుంటాయి. ఈ షో నిర్వహించేవారు తమ టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు గొడవలు ఎక్కువగా జరిగేలా చేయిస్తారు. ఈ బిగ్‌బాగ్ షోను ఇష్టపడేవాళ్లు ఉన్నట్లే.. దీన్ని వ్యతిరేకించేవాళ్లు కూడా ఉన్నారు. కంటెస్టెంట్లతో గొడవలు పెట్టించి, వాళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ఈ షోను తిడుతుంటారు. అయినప్పటికీ బిగ్‌బాస్‌కు మాత్రం పాపులారిటీ పెరుగుతోంది. వాస్తవానికి ఈ బిగ్‌బాస్ షో అనేది మన భారతీయుల ఆలోచన కాదు. మరి ఇది ఎవరి ఆలోచన ? అసలు ఎక్కడ పుట్టింది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?
బిగ్‌బాస్ షో అనేది మొట్టమొదటిసారిగా నెదర్లాండ్‌లో పుట్టింది. ఆ దేశంలోని ప్రముఖ టీవీ నిర్మాత 'జాన్ డె మోల్ జూనియర్' అనే వ్యక్తి 'బిగ్‌బ్రదర్' అనే షో కాన్సెప్ట్‌ను సృష్టించారు. 1999లో మొదటిసారిగా నెదర్లాండ్‌లోని వెరోనికా ఛానల్‌లో ఈ బిగ్‌బ్రదర్ షో ప్రసారమయ్యింది. ఈ మొదటి షోలో కంటెస్టెంట్లకు సౌకర్యాలు చాలా తక్కువగా ఉండేవి. ఒకటే పెద్దబెడ్ రూమ్, సాధారణ వంటగది, బయటి ప్రదేశం ఉండేది. పోటీదారులకు టాస్కులు పెట్టేవాళ్లు. ఇందులో పాల్గొనే వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఒకే ఇంట్లో వివిధ వ్యక్తులు ఉంటే వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో చూడటమే ఈ బిగ్ బ్రదర్ షో ప్రధాన లక్ష్యం. ఈ మొదటి షోలో 12 మంది పోటీదారులు పాల్గొన్నారు. 106 రోజుల పాటు ఈ షో జరిగింది. ఇది జనాలను ఆకట్టుకోవడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది.
Also Read: ఇది కదా మాకు కావాల్సింది..! మాస్ డాన్స్‌తో దుమ్ముదులిపిన ‘రెబల్ సాబ్’
2000 సంవత్సరం నుంచి ఈ షో ప్రపంచదేశాలకు విస్తరించడం మొదలైంది. జర్మనీ, అమెరికా, యూకే దేశాలు బిగ్‌బ్రదర్ షోను నిర్వహించాయి. ఆ తర్వాత ఇటలీ, బ్రెజీల్, కెనడా, స్వీడన్, పోర్చుగల్, బెల్జియం లాంటి దేశాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం 50కి పైగా దేశాల్లో వివిధ పేర్లతో ఈ షోను ప్రసారం చేస్తున్నారు. ఇక భారత్‌లో 2006లో 'బిగ్‌బాస్' అనే పేరుతో హిందీలో ఈ షోను ప్రారంభించారు. హిందీలో ఇది సక్సెస్ అయిన తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా ఈ షో విస్తరించింది. 2013లో కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభం కాగా 2017లో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తెలుగు బిగ్‌బాస్‌కు 2017లో మొదటి హోస్ట్‌గా జూనియర్ ఎన్డీయార్ వ్యవహరించారు. ఆ తర్వాత 2018లో మహారాష్ట్ర, కేరళలో కూడా ఈ షో ప్రారంభమయ్యింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని వాళ్ల ప్రాంతీయ భాషల్లో ఈ షో కొనసాగుతోంది.
Also Read: మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమమాలినిని రెండో పెళ్లి.. హగ్గుల కోసం రీ-టేక్‌లు!
2023లో బిగ్‌బాస్ OTT సీజన్ 2 నడుస్తున్న సమయంలో ప్రముఖ యూట్యూబర్ ధ్రవ్ రాఠీ వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోని వెళ్తారనే వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఖండిస్తూ ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఆ షోను అతడు చీప్, నాన్‌సెన్స్ అంటూ తిట్టాడు. తనకు ఎన్నికోట్లు ఆఫర్ ఇచ్చినా ఇలాంటి నాన్‌సెన్స్ షోకి వెళ్లనని స్పష్టం చేశారు. బిగ్ బాస్ అంతా ఒక డ్రామా అని కంటెస్టెంట్లకు గొడవలు పెట్టించి నిర్వాహకులు టీఆర్పీ పెంచుకుంటున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.
బిగ్‌బాస్ షోలో జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర వివాదాలకు కూడా దారితీశాయి. 2010లో జరిగిన హిందీ బిగ్‌బాస్ సీజన్ 4లో వీణా మాలిక్, అష్మిత్ పటేల్ అనే కంటెస్టెంట్లు దుప్పట్ల కింద అత్యంత సన్నిహితంగా కనిపించడం, ఒకరినొకరు మసాజ్ చేసుకోవడం లాంటి దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి. ఈ ఘటన అప్పట్లో దుమారం రేపింది. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమంటూ విమర్శలు వచ్చాయి. అదే హిందీ బిగ్‌బాస్ 8లో గౌతమ్ గులాటి, డియాండ్రా సోరెస్ కలిసి బాత్‌రూమ్‌లోకి వెళ్లడం.. కొంత సమయం తర్వాత ఇద్దరు కలిసి బయటికి రావడం కూడా వివాదాస్పదమైంది. వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి.
Also Read: రికార్డు బ్రేకింగ్ 'చికిరి'.. దుమ్మురేపుతున్న పెద్ది గాడు
2017లో జరిగిన సీజన్ 11లో కూడా పునీష్ శర్మ , బందగీ కల్రా కూడా రాత్రిపూట దుప్పట్ల కింద సాన్నిహిత్యంగా గడపడం, ముద్దులు పెట్టుకోవడం లాంటి దృశ్యాలు ప్రసారమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యింది. దీంతో బిగ్‌బాస్‌లో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. తెలుగు బిగ్‌బాస్‌లో కూడా సీజన్ 2 నడుస్తుండగా అందులో పాల్గొన్న కంటెస్టెంట్ కౌశల్ పేరుతో.. కౌశర్ ఆర్మీ అనే ఉద్యమమే నడిచింది. అయితే హిందీ బిగ్‌బాస్‌లో జరిగినంత అభ్యంతరకర సన్నివేశాలు తెలుగులో జరగలేదు. కానీ గొడవల్లో పలువురు కంటెస్టెంట్లు దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి బిగ్‌బాస్ షోను ఆదరించేవాళ్లు ఉన్నారు, తిట్టుకునేవాళ్లు ఉన్నారు. అయినప్పటికీ ఈ షోలు ప్రతి ఏడాది ప్రసారం అవుతూనే ఉన్నాయి.
Follow Us