/rtv/media/media_files/2025/07/28/acidity-tablets-2025-07-28-10-56-59.jpg)
Acidity tablets
ఎసిడిటీ నివారణకు విస్తృతంగా వాడే రానిటిడిన్ ఔషధంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఔషధంలో నైట్రోసోడైమెథైలమైన్ (NDMA) అనే ప్రమాదకరమైన పదార్ధం ఉన్నట్లు గుర్తించారు. ఎన్‌డీఎంఏ అనేది క్యాన్సర్ కారకంగా గుర్తింపబడిన ఒక రసాయనం. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆరోగ్య సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. తాజాగా భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఔషధ నియంత్రణాధికారులకు అలర్ట్ జారీ చేసింది.
Also Read : చిన్న బడ్జెట్.. కోట్లు కొల్లగొట్టింది! ఒక్కో సీన్ నెక్స్ట్ లెవెల్!
క్యాన్సర్ ముప్పు..
డ్రగ్స్, టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సిఫార్సులను పరిశీలించిన అనంతరం ఈ రానిటిడిన్ ఔషధంపై అధ్యయనం చేసి.. ఇందులో ప్రమాదకరమైన స్థాయిలో ఎన్‌డీఎంఏ ఉన్నట్లు తేలింది. దీంతో.. ఈ ఔషధాన్ని తయారు చేసే సంస్థలు..వాటి ఉత్పత్తులలో ఎన్‌డీఎంఏ స్థాయిలను నిరంతరం పరిశీలించాలని.. నియంత్రణలో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. రానిటిడిన్ వాడకానికి సంబంధించి గతంలో కూడా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అమెరికా, యూరప్ సహా పలు దేశాల్లో ఈ ఔషధాన్ని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్న సందర్భాలున్నాయి. భారతదేశంలో ఇప్పటికీ ఈ ఔషధాన్ని విస్తృతంగా వాడుతుండడం, దాని ప్రమాదాలను ప్రజలకు తెలియజేయాలన్న అవసరం కేంద్రాన్ని ఈ చర్యలు తీసుకునేలా చేసింది.
ఇది కూడా చదవండి: శివునితోపాటు సోమవారం ఏ దేవతలను పూజించాలో తెలుసా..?
ఎన్‌డీఎంఏ శరీరంలో స్వల్ప మోతాదులోనూ దీర్ఘకాలంగా చేరితే క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు రానిటిడిన్ వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం అత్యంత అవసరం. అదే విధంగా ఫార్మాసిస్టులు, ఔషధ కంపెనీలు తమ ఉత్పత్తులపై అధిక దృష్టి పెట్టాలి. ప్రభుత్వ సూచనలతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో ఇలాంటి ముప్పులను నివారించేందుకు సకాలంలో చర్యలు తీసుకోవడం ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: రాఖీ పండుగన బహుమతుల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
Also Read : ఛీ ఛీ.. గబ్బిలాలతో చిల్లీ చికెన్ - రాష్ట్రంలో బయటపడ్డ మోసం
( cancer | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News )