Chaurya Paatam: స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, హీరోకు ఎలివేషన్స్ ఉన్న సినిమాలు మాత్రమే రికార్డులు సృష్టిస్తాయనుకుంటే అనుకుంటే పొరపాటే! ఇది ఒక్కప్పటి ట్రెండ్.. ఇప్పుడు ప్రేక్షకులు సినిమా చూసే విధానం పూర్తిగా మారింది. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు! అలాంటి సినిమానే 'చౌర్య పాఠం'. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం థియేటర్స్ పెద్దగా సందడి చేయకపోయినా.. ఓటీటీలో మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు.
ఓటీటీలో రికార్డ్..
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన ఈ సినిమా రికార్డు వ్యూస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కామెడీ, క్రైమ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని కథను అందించగా.. నిఖిల్ గొల్లమారి డైరెక్ట్ చేశారు. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో కొత్త నటుడు హీరో ఇంద్ర రామ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. తన పాత్రలో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు పొందాడు.
#ChauryaPaatam is a tightly written thriller with smart twists and gripping robbery scenes. Feels like a Money Heist! The slow start pays off with a layered story. A must-watch for fans of intense thrillers. pic.twitter.com/QScu2KEJh4
— Ramesh Bala (@rameshlaus) July 27, 2025
కథ ఏంటి
సినిమా తీయాలనే పిచ్చితో ఉన్న ఓ యువకుడి చుట్టూ 'చౌర్య పాఠం' తిరుగుతుంది. అయితే సినిమా తీయాలని కలలు కనే అతడికి డబ్బు లేకపోవడంతో ఒక దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తాడు. నేరాలు లేని ఒక గ్రామంలోని బ్యాంకును దోచుకోవడానికి ప్లాన్ చేస్తాడు. దాని కోసం ఒక ముఠాను కూడా ఏర్పర్చుకుంటాడు. అయితే, ఈ దొంగతనాల ప్రయత్నంలో వారికి ఎదురయ్యే ఊహించని పరిణామాలు, హాస్య సన్నివేశాలు, సస్పెన్స్ సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి. ఈ దొంగతనం ప్రయాణం హీరో జీవితాన్ని ఎలా మారుస్తుంది అనేది సినిమా కథ.