/rtv/media/media_files/2025/07/28/tamil-nadu-bat-hunting-gang-2-2025-07-28-13-19-32.jpg)
Tamil Nadu Bat Hunting Gang (2)
తమిళనాడులోని సేలం జిల్లాలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విచారించగా.. వారు దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడించారు. గబ్బిలాలను వేటాడి, వాటి మాంసాన్ని ‘‘చిల్లీ చికెన్’’ పేరుతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ గబ్బిలాల వేట ముఠా అరెస్టుతో తమిళనాడులో చిల్లీ చికెన్ స్కామ్ బట్టబయలైంది.
ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
Tamil Nadu Bat Hunting Gang
పోలీసుల విచారణలో.. సెల్వం, కమల్ అనే నిందితులు గత కొన్ని నెలలుగా ఈ దారుణమైన పని చేస్తున్నట్లు అంగీకరించారు. గబ్బిలాలను చంపి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి, చికెన్‌కు బదులుగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. కొన్ని హోటళ్లకు స్వయంగా గబ్బిలాల మాంసంతో వండిన చిల్లీ చికెన్ వంటకాలను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. గతంలో కూడా కొందరు ఇలాగే చేస్తున్నారని నిందితులు వెల్లడించడంతో అధికారులు అవాక్కయ్యారు.
ఇది కూడా చూడండి: పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన
Two Tamil Nadu men held for hunting, selling cooked fruit bats as chicken meat#TN#Bats#Arrest@PramodMadhav6
— IndiaToday (@IndiaToday) July 28, 2025
Read more: https://t.co/xJNJaaQNrGpic.twitter.com/nQiwwR0MIq
ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
ఈ సమాచారంతో సేలం పోలీసులు, ఆహార భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై తనిఖీలకు సిద్ధమవుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యం, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అంశం కావడంతో, పోలీసులు ఈ గబ్బిలాల మాంసం కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి మోసగాళ్లను అదుపులోకి తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు కూడా బయటి ఆహారాన్ని తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.