/rtv/media/media_files/2025/11/03/clove-water-2025-11-03-20-29-23.jpg)
Clove water
ప్రతి వంటింట్లోనూ లభించే సుగంధ ద్రవ్యాలలో లవంగాలు (Cloves) ఒకటి. ఇవి పరిమాణంలో చిన్నవిగా కనిపించినా.. వాటి ఆరోగ్య ప్రయోజనాలు అపారం. ఆహారానికి రుచిని ఇవ్వడంతోపాటు లవంగాల వినియోగం అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలలో విటమిన్ సి, ఇ, కె, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. లవంగాల నీటిని 14 రోజుల పాటు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లవంగాల నీటిని తయారు చేసే సరైన పద్ధతి, ఏ సమయంలో తాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
లవంగాల నీరు తాగడం వల్ల..
కాలేయం (Liver) డిటాక్స్: లవంగాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం, కాలేయం నుంచి విషపదార్థాలను తొలగిస్తాయి. దీనివల్ల శరీరం, కాలేయం శుభ్రపడి (Detoxify), చర్మ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
నిద్ర నాణ్యత: సరిగా నిద్ర పట్టకపోతే.. లవంగాల నీరు తాగవచ్చు. దీని వినియోగం శరీరంలో నిద్ర హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. 14 రోజులు తాగిన తర్వాత మీరు మెరుగైన ఫలితాన్ని చూడవచ్చు.
 ఇది కూడా చదవండి: రాత్రి నిద్రకు ముందు ఈ మిశ్రమం తాగితే... ఉదయానికల్లా పేగుల్లోని మలినాలు క్లీన్!
జీర్ణక్రియ (Digestion) మెరుగుదల: జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి లవంగాల నీరు తీసుకోవచ్చు. ఇది కడుపు ఉబ్బరం (Bloating), గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం అందించి, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
రోగనిరోధక శక్తి (Immunity) పెంపు: లవంగాల నీరు క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, ఫ్లూ వంటి కాలానుగుణ అనారోగ్యాల నుంచి రక్షణ పొందడంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
లవంగాల నీరు తయారు చేసే విధానం చాలా సులభం. 4-5 లవంగాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. లవంగాలను 5 నిమిషాలు ఉడికించి.. అది చల్లబడిన తర్వాత గోరువెచ్చగా తాగవచ్చు. డిటాక్సిఫికేషన్ కోసం లవంగాల నీరు తాగడానికి సరైన సమయం ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తాగడం ఉత్తమం. మెరుగైన నిద్ర కోసం నిద్రించడానికి 30 నిమిషాల ముందు లవంగాల నీటిని తాగవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చలికాలం ఆహారం ఏ పిండి తినాలో.. తినకూడదో తెలుసుకోండి!!
 Follow Us