/rtv/media/media_files/2025/09/29/black-hands-2025-09-29-17-16-54.jpg)
Black hands
ముఖాన్ని కాంతివంతంగా ఉంచుకోవడానికి ఖరీదైన మేకప్ ఉత్పత్తులు వాడుతున్నా.. చాలామంది చేతులు, కాళ్ల సంరక్షణను విస్మరిస్తారు. రోజంతా దుమ్ము, సూర్యరశ్మి, శుభ్రపరిచే పనులు, రసాయన ఉత్పత్తుల ప్రభావం వల్ల ముఖంతోపాటు చేతులు కూడా నల్లబడి, నిర్జీవంగా కనిపిస్తాయి. ఇంట్లోనే సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తే ఖర్చు లేకుండానే నల్లబడిన చేతులను తెల్లగా, అందంగా మార్చుకోవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు. నల్లబడిన చేతులను తెల్లగా మార్చే సులువైన ఇంటి చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కాంతివంతంగా మార్చేందుకు అద్భుతమైన చిట్కాలు:
శనగపిండి, పెరుగు: శనగపిండి, పెరుగును కలిపి పేస్ట్‌గా చేసి చేతులకు రాసుకోవాలి. శనగపిండి స్క్రబ్‌లా పనిచేసి మురికిని తొలగిస్తుంది. పెరుగు చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
నిమ్మ, తేనె ప్యాక్: నలుపును గణనీయంగా తగ్గించడానికి నిమ్మరసం, తేనె కలిపిన ప్యాక్‌ను చేతులకు అప్లై చేసి కడగాలి. ఈ ప్యాక్ ముఖంపై మురికిని తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది.
బంగాళాదుంప రసం: పచ్చి బంగాళాదుంపను తురుము పట్టి రసాన్ని తీసి చేతులపై బాగా మసాజ్ చేయాలి. ఇది నలుపును తగ్గించడంలో, చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: యవ్వనంగా కనిపించేందుకు ఇంటి చిట్కాలను ఫాలో అవుదాం.. అవేంటో తెలుసుకోండి!!
పచ్చి పాలు (Raw Milk): పచ్చి పాలను చేతులకు రాసి సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా చేతులపై ఉండే నల్ల మచ్చలు, చనిపోయిన చర్మ కణాలు (డెడ్ స్కిన్ సెల్స్) తొలగిపోతాయి. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
పెరుగు, పసుపు మిశ్రమం: పెరుగులో చిటికెడు పసుపు కలిపి రాసుకోవడం ద్వారా కూడా చర్మంపై ఉండే నల్ల మచ్చలు తగ్గి.. చేతులు అందంగా మారుతాయి. ఈ సహజ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తూ మీ చేతుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: దసరా రోజు ఈ మొక్కని నాటితే.. మీ దరిద్రాలన్నీ పరార్.. తప్పక తెలుసుకోండి!