Health Tips: పోషకాహార లోపం ఉంటే షుగర్‌తోపాటు ఆ రోగాలు.. తప్పక తెలుసుకోండి!

పోషకాహార లోపంతో ఉన్న తల్లులకు పుట్టే పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది..ఈ లోపంతో ఉన్న ఎలుకల్లో ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా, విటమిన్ B12, ఫోలేట్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు అధ్యయనం నిపుణులు చెబుతున్నారు.

New Update
Obesity

Obesity

పోషకాహార లోపం అంటే కేవలం సన్నగా ఉండటమే కాదు. ఊబకాయం మరియు మధుమేహానికి కూడా ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. 2025 నాటికి పాఠశాల పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో ఊబకాయం ఉన్నవారు తక్కువ బరువు ఉన్నవారి సంఖ్యను మించిపోతారని UNICEF అంచనా వేసింది. సాధారణంగా పోషకాహార లోపం అంటే బరువు తక్కువగా ఉండటమే అనుకుంటాం. అయితే పేదరికంలో ఉన్నవారు, తక్కువ సమాచారం ఉన్నవారు తరచూ చౌకగా లభించే.. చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలను కొనుగోలు చేస్తారు. ఈ ఆహారాల్లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. పోషకాహార లోపం ఉంటే ఊబకాయం, మధుమేహం ఎంత ప్రమాదమో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పోషకాహార లోపంతో రోగాలు:

సెలబ్రిటీల ప్రచారంతో చవకగా లభించే తీపి పానీయాలు ఊబకాయం, మధుమేహానికి కారణమవుతాయి. అదే సమయంలో బాగా చదువుకున్నవారు పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. పోషకాహార లోపంతో ఉన్న తల్లులకు పుట్టే పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు. ఇటీవలి ఓ అధ్యయనంలో పోషకాహార లోపంతో ఉన్న ఎలుకల్లో ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువగా, విటమిన్ B12, ఫోలేట్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా రెండు తరాల వరకు కూడా సాధారణ ఆహారం ఇచ్చినప్పటికీ వాటిలో జీవక్రియ మార్పులు అలాగే ఉన్నట్లు తేలింది.

ఇది కూడా చదవండి: మచ్చలేని చర్మం కోసం ఈ పూల ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిన్నతనంలో పోషకాహార లోపం ఉన్నప్పుడు.. శరీరం శక్తిని నిల్వ ఉంచుకుంటుంది. కొవ్వును సరిగా నిల్వ చేయదు, కండరాలు సరిగా పెరగవు. దీనివల్ల జీవక్రియలో దీర్ఘకాలిక మార్పులు వస్తాయి. అలాంటివారు తరువాత అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకుని, వ్యాయామం లేని జీవనశైలిని అనుసరించినప్పుడు, వారికి ఊబకాయం, టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి పోషకాలు ఎక్కువగా, తక్కువ ధరలో లభించే ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, అనారోగ్యకరమైన ఆహార పదార్థాల ప్రచారాలను నిరోధించాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మీ పళ్లు పచ్చగా మారితే డేంజర్.. ఎందుకో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు