/rtv/media/media_files/2025/05/01/Dm1G0a1y73dTNGUkLMQT.jpg)
tea and smoking health effectes
ప్రస్తుత కాలంలో టీ, కాఫీలు తాగే వారి సంఖ్య పెరిగిపోయింది. చాలామంది రోజులో 4 నుంచి 5 కప్పుల టీ తాగేస్తుంటారు. మరికొందరైతే టీ తాగుతూనే సిగరెట్ కాల్చేస్తుంటారు. అయితే ఇలా టీ తాగుతూ దూమపానం చేసేవాళ్లు తరచూ రోడ్లమీద టీ షాపూల దగ్గర కనబడుతుంటారు. టీ తాగుతూ సిగరెట్ కాల్చితే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల పూర్తిగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని.. అనేక జబ్బులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, జీర్ణకోశ సమస్యలు వంటివి ఎదురవుతాయని అంటున్నారు.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి
క్యాన్సర్
టీ తాగుతూ ధూమపానం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా అన్న వాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వేడి వేడి టీ అన్నవాహిక కణాలను దెబ్బతీస్తుందని.. అదే సమయంలో సిగరెట్ లోని రసాయనాలు మరింతగా నష్టపరుస్తాయని చెబుతున్నారు. వీటి కారణంగా ఇది క్యాన్సర్ కు దారితీస్తుంది అని వైద్య చెబుతున్నారు. అది మాత్రమే కాకుండా దీనివల్ల గొంతు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
జీర్ణకోశ సమస్యలు
టీ తాగుతూ.. సిగరెట్ కాల్చేవారిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టీలో ఉండే టానిన్లు, సిగరెట్‌లో ఉంటే రసాయనాలు జీర్ణక్రయను వేగవంతం చేయకుండా.. స్లోగా చేస్తాయి. దాని ఫలితంగా అసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్ వంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది.
గుండె సంబంధిత సమస్యలు
ధూమపానం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. అదే సమయంలో టిఫిన్ కూడా రక్తపోటుని ఇంకా ఎక్కువ చేస్తుంది. దీంతో ఈ రెండు కలిసి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
ఇది కూడా చూడండి: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
అంతేకాకుండా చాయ్ తాగుతూ సిగరెట్ కల్చడం వల్ల మగవాళ్లలో శుక్ర కణాల నాణ్యత క్షీణిస్తుంది. అదే సమయంలో స్త్రీలతో అండాశయాల పనితీరుపై తీవ్రంగా ప్రభావితం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇలాంటి అలవాటును వెంటనే మానుకోవాలని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
smoking-affects | smoking habit | smoking kills | latest-telugu-news | telugu-news | health tips in telugu | latest health tips | best-health-tips
Follow Us