CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి

ఇద్దరు కింగ్స్ తలపడ్డారు. నువ్వే నేనా అన్నట్టు పోటీ పడి పరుగులు చేశారు. కానీ చివరకు పంజాబ్ కింగ్స్ కు విజయం దక్కింది. ఈరోజు చెన్నై, పంజాబ్ కు జరిగిన మ్యాచ్ లో పీబీకేఎస్ నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలిచింది. 

New Update
ipl

CSK VS PBKS

సొంత గ్రౌండ్ లో చెన్నై హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టకుంది. ఐపీఎల్ లో భాగంగా చెపాక్ స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 190 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. దీన్ని పంజాబ్ బ్యాటర్లు ఈజీగా కొట్టేశారు. ఆరు వికెట్లు కోల్పోయిన పంజాబ్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్న ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌  41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 పరుగులు, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. చెన్నై బౌలర్లలో పతిరణ 2, ఖలీల్‌ అహ్మద్‌ 2, నూర్‌ అహ్మద్‌, జడేజా తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి వెళ్ళిపోయింది. 

చెన్నై బ్యాటర్ల కష్టం వృధా..

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజృంభించింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. CSK జట్టు బ్యాటర్లలో సామ్ కరన్ 47 బంతుల్లో 88 పరగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. డెవాల్డ్ బ్రెవిస్ (32) పరుగులు చేశారు. రషీద్ (11), మాత్రే (7), రవీంద్ర జడేజా (17), దూబె (6), ధోనీ (11), దీపక్ హుడా (2), కంబోజ్ (0), నూర్ అమ్మద్ (0) పరుగులు చేశారు. 

పంజాబ్ కింగ్స్ బౌలర్లు అదరగొట్టేశారు. అర్ష్‌దీప్ 2 వికెట్లు, మార్కో యాన్సెన్ 2 వికెట్లు, ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. యుజ్వేంద్ర చాహల్ 19 ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అందులో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.

today-latest-news-in-telugu | IPL 2025 | csk vs pbks match

Also Read:Ind-Pak: పాకిస్తాన్ కు మరో షాక్..ఫ్లైట్స్ ఎంట్రీకి నో

Advertisment
తాజా కథనాలు