/rtv/media/media_files/2025/10/29/tea-2025-10-29-07-31-57.jpg)
Tea
భారతీయులు టీ తాగడానికి చాలా ఇష్టపడతాం. చాలామంది రోజును వేడివేడి టీ కప్పుతోనే ప్రారంభిస్తారు. అయితే టీ తాగే విషయంలో ఒక్కొక్కరి అభిరుచులు ఒక్కో విధంగా ఉంటాయి. కొందరికి స్ట్రాంగ్ టీ కావాలి, మరికొందరికి లైట్, పాల టీ అంటే ఇష్టం. చాలామంది ఫలానా వ్యక్తి చేసిన టీనే బాగుంటుందని అంటారు. లేదా ఎంత ప్రయత్నించినా మాకు ఆ రుచి రావడం లేదని బాధపడతారు. మీరు కూడా ఈ కోవకు చెందినవారైతే.. టీ రుచి, ప్రభావానికి అతిపెద్ద రహస్యం టీ పొడిని సరైన పరిమాణంలో ఉపయోగించడమే అని తెలుసుకోవాలి. టీ పొడి ఎక్కువైతే టీ చేదుగా మారి.. ఘాటుగా ఉంటుంది. అదే తక్కువైతే దాని రంగు, సువాసన, రుచి నీరసంగా మారుతాయి. మరి ఒక కప్పు టీకి ఎంత టీ పొడి వేయాలి అనే వివరాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
టీ ఆకులు ఎంత మోతాదులో వాడాలి:
ఒక పర్‌ఫెక్ట్ కప్పు టీ తయారు చేయడానికి.. సాధారణంగా ఒక కప్పు నీరు లేదా పాలకు ఒక టీస్పూన్ (సుమారు 2 గ్రాములు) టీ ఆకులు ఆదర్శంగా చెబుతారు. ఈ మోతాదులో వేయడం వలన టీ మరీ ఘాటుగా ఉండదు.. మరీ పలచగానూ ఉండదు. మీరు కొంచెం ఘాటుగా (Strong) ఉండే టీని ఇష్టపడితే... ఒకటిన్నర టీస్పూన్ల టీ పొడిని ఉపయోగించవచ్చు. కానీ దానికంటే ఎక్కువ వేయకుండా జాగ్రత్త వహించాలి. అలాగే.. టీ రకాన్ని బట్టి కూడా ఈ పరిమాణం కొద్దిగా మారవచ్చు. ఉదాహరణకు అస్సాం టీ రుచిలో తీవ్రంగా ఉంటుంది. కాబట్టి కొంచెం తక్కువ ఆకులు వాడవచ్చు. అయితే డార్జిలింగ్ టీ తాగితే.. మరింత గొప్ప రుచి కోసం కొద్దిగా ఎక్కువ ఆకులు వేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: జుట్టు సమస్యలు ఎన్నైనా.. మ్యాజిక్ హెయిర్ ఆయిల్ ఒక్కటి చాలు!!
ఆరోగ్యం గురించి మాట్లాడితే.. టీ ఆకులలో కాటెచిన్స్ (Catechins), థియాఫ్లావిన్స్ (Theaflavins) వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఓ అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా, మితంగా టీ తాగడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. అయితే టీ ఆకులు ఎక్కువగా వేయడం వలన కెఫిన్, టానిన్ (Tannin) కంటెంట్ పెరుగుతుంది. ఇది అసిడిటీ, నిద్రలేమి, చికాకు వంటి సమస్యలను కలిగించవచ్చు. అందువల్ల టీ చేసేటప్పుడు టీ ఆకులను అవసరాన్ని బట్టి కొలతతో ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ చిన్న రహస్యాన్ని పాటించడం ద్వారా ప్రతిరోజూ రుచికరమైన, ఆరోగ్యకరమైన టీని ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఇంట్లోనే దంతాల పొడి చేయండి.. పళ్లు తల తలా మెరిసేలా చేసుకోండి.. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి
Follow Us