/rtv/media/media_files/2025/11/04/walking-and-chole-bhature-2025-11-04-19-55-09.jpg)
walking and Chole bhature
ఈ రోజుల్లో చాలా మందిని అధిక బరువు (Weight Gain), బొడ్డు చుట్టూ కొవ్వు (Belly Fat) సమస్యలు వేధిస్తున్నాయి. బరువు తగ్గడానికి చాలా మంది కఠినమైన ఆహార నియమాలు (Strict Dieting), జిమ్ వర్కౌట్స్‌ను ఆశ్రయిస్తారు. అయితే తిన్న తర్వాత నడవడం ద్వారా కేలరీలను ఖర్చు చేయవచ్చని, తద్వారా సమతుల్య బరువును నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనకు ఇష్టమైన ఆహార పదార్థాల కేలరీలను బ్యాలెన్స్ చేయడానికి ఎంత నడక అవసరమో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
భోజనం తర్వాత నడవడం ఎందుకు ప్రయోజనకరం:
ప్రతిరోజూ సాదా ఆహారం తినడం కొందరికి విసుగు తెప్పిస్తుంది. అందుకే చీట్ డేస్ (Cheat Days) రోజున చోలే భటూరే, సమోసా, పిజ్జా వంటి తమ అభిమాన వంటకాలను తినాలని కోరుకుంటారు. కానీ ఈ వంటకాలు తిన్న తర్వాత బరువు పెరుగుతామనే భయం వెంటాడుతూ ఉంటుంది. అయితే ఆహారం తిన్న తర్వాత కొంత శారీరక శ్రమ (Physical Activity) చేస్తే ఆ అదనపు కేలరీలను సులభంగా బర్న్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: తినడానికి ముందు ఈ చిట్కా పాటిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్య దరి చేరదు
ఎవరైనా ఎక్కువ మొత్తంలో లేదా నూనె పదార్థాలు తిన్న తర్వాత అలాగే కూర్చుంటే.. శరీరం ఆ కేలరీలను కొవ్వుగా (Fat) నిల్వ చేసుకుంటుంది. అయితే ఆహారం తీసుకున్న 15-20 నిమిషాల తర్వాత తేలికపాటి నడక (Light Walk) చేస్తే...జీర్ణక్రియ (Digestion) మెరుగుపడుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar) నియంత్రించడానికి సహాయపడుతుంది. శరీరం కేలరీలను శక్తిగా (Energy) మార్చడానికి అనుమతిస్తుంది. దీని వలన కొవ్వు నిల్వ అవ్వకుండా నిరోధించబడుతుంది, బరువు పెరిగే ప్రమాదం తగ్గుతుంది. అందుకే ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించిన తర్వాత నడకను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఆవ నూనెతో ఆయుర్వేద ఉపాయం.. నొప్పులు అవుతాయి మటు మాయం
Follow Us