Mustard Oil: ఆవ నూనెతో ఆయుర్వేద ఉపాయం.. నొప్పులు అవుతాయి మటు మాయం

ప్రస్తుత రోజుల్లో కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి లేదా శరీరంలో ఏదైనా రకమైన బిగుతు చాలా సాధారణమైపోయాయి. ఇంతకుముందు ఈ రకమైన నొప్పులు వృద్ధాప్య లక్షణాలుగా భావించేవారు. కానీ ఇప్పుడు యువకులు కూడా శరీర నొప్పులతో బాధపడుతున్నారు.

New Update
Mustard Oil

Mustard Oil

ప్రస్తుత రోజుల్లో కీళ్ల నొప్పులు (Joint Pain), వెన్నునొప్పి (Back Pain) లేదా శరీరంలో ఏదైనా రకమైన బిగుతు (Stiffness) చాలా సాధారణమైపోయాయి. ఇంతకుముందు ఈ రకమైన నొప్పులు వృద్ధాప్య లక్షణాలుగా భావించేవారు.. కానీ ఇప్పుడు యువకులు కూడా శరీర నొప్పులతో బాధపడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో.. చాలా మంది నొప్పి నివారణ మందులను (Painkillers) ఆశ్రయిస్తారు. అయితే మందులను నిరంతరం వాడటం వలన శరీరంపై ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. ఈ సమస్యకు ఆయుర్వేదం (Ayurveda) చాలా సులభమైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కాను అందిస్తోంది.   ఆయుర్వేద వైద్యుల ప్రకారం.. కొన్ని పదార్థాలను ఆవాల నూనెలో (Mustard Oil) కలిపి వాడితే.. అది నొప్పి నివారణిగా పనిచేస్తుంది. ఈ చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

నొప్పుల నివారణ నూనె కోసం..

డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. ఆవాల నూనెలో నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. దీనికి 3 ప్రత్యేక పదార్థాలను కలిపితే.. అది మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఆవాల నూనె (Mustard Oil) 100 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు (Garlic Cloves) 2 పూర్తి గడ్డలు, వాము (Carom Seeds/Ajwain) 10 గ్రాములు, జాజికాయ (Mace/Javitri) 5 గ్రాములను సిద్దంగా పెట్టుకొవాలి. మొదటగా, వెల్లుల్లి, వాము, జాజికాయలను కొద్దిగా చిన్నగా దంచాలి (crush). ఇప్పుడు ఒక పాత్రలో ఆవాల నూనెను తీసుకుని వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత దంచిన ఆ మూడు పదార్థాలను అందులో కలపాలి. ఆ నూనె రంగు మారి నలుపు రంగులోకి వచ్చేవరకు తక్కువ మంటపై బాగా మరిగించాలి. నూనె మాడిపోకుండా జాగ్రత్త వహించాలి. నూనె చల్లారిన తర్వాత దానిని వడగట్టి (Strain) గాజు సీసాలోకి పోయాలి.

 ఇది కూడా చదవండి: లవంగం నీటితో ఎన్ని లాభలో తెలిస్తే తాగకుండా ఉండలేరు మరి.. ఎలా తాగాలో.. ఎప్పుడు తాగాలో చదివి తెలుసుకోండి

కీళ్లు, మోకాలు, వీపు, శరీరంలో మరే ఇతర ప్రాంతంలో నొప్పి ఉన్నా.. ఈ నూనెను కొద్దిగా వెచ్చగా చేసి ప్రభావిత ప్రాంతంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నూనెలో ఉన్న వెల్లుల్లికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వలన వాపు, నొప్పి తగ్గుతాయి. వాము  కండరాల బిగుతును తగ్గించి, వెచ్చదనాన్ని అందిస్తుంది. జాజికాయ నరాలను శాంతపరచి, నొప్పిని ఉపశమనం చేస్తుంది. ఆవాల నూనె స్వయంగా వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.. ఇది కీళ్ల బిగుతును తగ్గించడంలో సహాయపడుతుంది. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. ఈ నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వలన కీళ్లవాతం (Arthritis).. సయాటికా (Sciatica), సర్వైకల్ నొప్పి, వెన్నునొప్పి, మోకాలి నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది పూర్తిగా సహజమైన   సురక్షితమైన పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: తినడానికి ముందు ఈ చిట్కా పాటిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్య దరి చేరదు

Advertisment
తాజా కథనాలు