Digestion: ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే ఇలా చేయండి

ఆహారాలు, స్వీట్లు, కృత్రిమ తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. జీర్ణ సమస్యను నివారించడానికి ఫైబర్ బాగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు, బార్లీ, ఓట్స్, విత్తనాలు, చిక్కుళ్ళు వంటి ఆహారాలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

New Update

Digestion: ఈ రోజుల్లో జీర్ణ సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం, కూర్చొని పనిచేసే పని కావచ్చు. శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోవడంలో కొన్ని అంతరాయాలు ఏర్పడితే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు తినడం. ఫైబర్ బాగా ఉండే ఆహారాలు జీర్ణవ్యవస్థను సహజంగా మెరుగుపరుస్తాయి. పండ్లు, కూరగాయలు, బార్లీ, ఓట్స్, విత్తనాలు, చిక్కుళ్ళు వంటి ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 

ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు..

జీర్ణప్రక్రియను వేగవంతం చేసి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అల్లంలో ఉన్న శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అజీర్ణం, వికారం నుండి ఉపశమనం కలిగిస్తాయి. వంటల్లో అల్లం వాడటం లేదా అల్లం టీ తాగడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. వంట సోడా జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగడం మంచిది. వంట సోడా కడుపులో ఆమ్లతను సమతుల్యం చేసి అజీర్ణం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. జీలకర్రలో ఉండే సహజ ఆహార పదార్థాలు జీర్ణక్రియను పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ సరైన అలవాట్లను పాటించడం ద్వారా జీర్ణ సమస్యలను నివారించవచ్చు. 

ఇది కూడా చదవండి: మానసిక స్థితిని మెరుగుపరిచే అద్భుతమైన ఆహారాలు

అలాగే వేయించిన ఆహారాలు, స్వీట్లు, కృత్రిమ తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఇవన్నీ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. సొంపు కూడా ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత ఒక చెంచా సోంపు తినడం శరీరానికి సహజంగా ఆహారాన్ని జీర్ణం చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ మార్గాలను పాటించడం ద్వారా జీర్ణ సమస్యలను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నెల్లూరులో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం!( digestion-tips-telugu | good-digestion | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు