/rtv/media/media_files/2025/10/13/cream-biscuits-2025-10-13-15-23-25.jpg)
Cream Biscuits
భారతదేశంలో పిల్లలతో సహా అన్ని వయసుల వారు ఇష్టపడే క్రీమ్ బిస్కెట్లు(Cream biscuits) ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతున్నాయి. వాటి రుచి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో.. వాటి ప్రభావం అంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రీమ్ బిస్కెట్లు అని పిలిచే వాటిలో నిజమైన పాల క్రీమ్ అస్సలు ఉండదు. బిస్కెట్ల మధ్య ఉండే తెల్లని లేదా రంగుల పూత వాస్తవానికి ఒక నకిలీ నాన్-డైరీ మిశ్రమం. దీని తయారీలో చౌకైన, విషపూరిత రసాయనాలు, ట్రాన్స్ ఫ్యాట్, షుగర్ సిరప్, కృత్రిమ రుచులు (Artificial Flavors) వాడుతున్నారు. ఈ తీపి విషం మన ధమనులను, ముఖ్యంగా పిల్లల ఎదుగుదలను నాశనం చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రీమ్ బిస్కెట్ దాగివున్న ప్రమాదం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
గుండె జబ్బులతోపాటు క్యాన్సర్ ముప్పు..
క్రీమ్ బిస్కెట్లలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ అతిపెద్ద ప్రమాదకారి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL)ను పెంచి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా వీటిని తినడం వల్ల మధుమేహం (Type-2 Diabetes), ఊబకాయం వంటి రోగాలు వస్తాయి. పిల్లల్లో జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం, ఎదుగుదల లోపానికి ఇది దారి తీస్తుంది. బిస్కెట్‌లలోని షుగర్ సిరప్ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, స్థూలకాయం, ఫ్యాటీ లివర్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: భోజనం తర్వాత ఈ ఆకు తింటున్నారా..? నోటి దుర్వాసనతో పాటు మరెన్నో సమస్యలకు చెక్
అంతేకాక.. కృత్రిమ రంగులు, రుచులు పిల్లల్లో చికాకు, హైపర్యాక్టివిటీని కలిగిస్తాయి. కొన్ని రంగులలో ఉండే కార్సినోజెనిక్ (క్యాన్సర్ కారక) పదార్థాలు కాలేయం, మూత్రపిండాలపై దాడి చేస్తాయి. ఎమల్సిఫైయర్‌లు, ప్రిజర్వేటివ్‌లు ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేసి.. జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయని వైద్యులు అంటున్నారు. క్రీమ్ బిస్కెట్ కేవలం ఆహారం కాదు.. ఇది నెమ్మదిగా పనిచేసే విషం. వీటిని రోజువారీ అలవాటుగా చేసుకోవడం అంటే తీవ్రమైన వ్యాధుల వైపు అడుగు వేయడమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: PCOD-PCOS రెండింటి మధ్య తేడా మీకు తెలుసా..?