/rtv/media/media_files/2025/10/12/betel-leaf-2025-10-12-10-07-09.jpg)
Betel Leaf
భోజనం చేసిన తర్వాత చాలామంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాలు, పంటి పరిశుభ్రత లోపం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే.. ఈ సమస్యకు మన సంస్కృతిలో భాగమైన తమలపాకు (Betel Leaf) ద్వారా సులభంగా పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత తమలపాకు తింటే నోటి దుర్వాసనతోపాటు ఏ సమస్యలు తగ్గుతాయో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు:
తమలపాకు కేవలం సంస్కృతీ, సంప్రదాయాలకే పరిమితం కాదు.. ఇందులో విటమిన్ ఎ, సి, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, అయోడిన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. నిపుణుల ప్రకారం.. భోజనం తర్వాత తమలపాకు తినడం వలన నోటి దుర్వాసన, పసుపు పళ్లు వంటి సమస్యలు దూరమవుతాయి. తమలపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తాయి. ఇది దుర్వాసన, పసుపు పళ్ళు, చిగుళ్ల వాపు, ఫలకం (Plaque) వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా.. నోటిలో ఇరుక్కున్న ఆహార కణాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: పొద్దున్నే బ్రేక్ ఫాస్టులో ఇవి లాగిస్తే ఆయుష్షు, మెదడు సేఫ్
తమలపాకు జీర్ణ సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు, ఒత్తిడిని తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ-హైపర్‌గ్లైసెమిక్ లక్షణాలు టైప్ 2 మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు మొటిమలు, దురద వంటి చర్మ సమస్యలకు కూడా తమలపాకు ప్రయోజనకరంగా ఉంటుంది. గాయకులు పూర్వకాలంలో గొంతు బలాన్ని పెంచుకోవడానికి కూడా వీటిని ఉపయోగించేవారు. తమలపాకులను శుభ్రంగా కడిగి.. తొడిమ తొలగించాలి. ఆ తర్వాత సున్నం (lime), కాచు (catechu) కొద్దిగా కలిపి, సోంపు లేదా గుల్‌కంద్, అతిమధురం వంటివి వేసి మడిచి తింటే రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: గొంతు జాగ్రత్త.. లేదంటే స్వరపేటిక క్యాన్సర్ రావొచ్చు!