Women Health Tips: PCOD-PCOS రెండింటి మధ్య తేడా మీకు తెలుసా..?

PCOSను PCOD కంటే ఎక్కువ తీవ్రమైనదిగా చెబుతారు. దీనికి ప్రధాన కారణం గర్భధారణపై దీని ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితిలో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అండాశయాలు పూర్తిగా పనిచేయడం ఆపవుని నిపుణులు చెబుతున్నారు.

New Update
PCOD-PCOS

PCOD-PCOS

నేటి ఆధునిక అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా మహిళల్లో PCOD (Polycystic Ovarian Disease) మరియు PCOS (Polycystic Ovarian Syndrome) సమస్యలు సర్వసాధారణమవుతున్నాయి. క్రమరహిత నెలసరి, బరువు పెరగడం, మొటిమలు, జుట్టు రాలడం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తున్నప్పటికీ.. చాలా మంది వీటిని ఒత్తిడి లేదా పోషకాహార లోపంగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే.. ఈ రెండింటి పేర్లు ఒకేలా ఉన్నా.. వాటి మధ్య ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఈ విషయం ప్రతి మహిళ తెలుసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రతి మహిళ PCOD, PCOS మధ్య ఎలాంటి తేడా  తెలుసుకోవాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

 PCOD-PCOS మధ్య తేడాలు:

హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే ఈ రెండు సమస్యల్లో.. PCODని సాధారణంగా ఒక డిజార్డర్‌గా చెబుతారు. ఇందులో స్త్రీల అండాశయాలు కొద్దిగా పెద్దవై, చిన్న చిన్న తిత్తులను (cysts) ఏర్పరుస్తాయి. సరైన జీవనశైలి మార్పులు, చికిత్సతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. అయితే.. PCOS అనేది మరింత క్లిష్టమైన సిండ్రోమ్. ఇది కేవలం అండాశయాలకే కాకుండా.. శరీరంలోని ఇతర భాగాలపైనా ప్రభావం చూపుతుంది. PCOSలో ఆండ్రోజెన్ స్థాయిలు విపరీతంగా పెరగడం వలన అండోత్సర్గము (ovulation) పూర్తిగా ఆగిపోతుంది.

ఇది కూడా చదవండి: ముల్లంగి ఆకులు పడేస్తున్నారా..? అయితే ఈ బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాల్సిందే!!

 PCOSను PCOD కంటే ఎక్కువ తీవ్రమైనదిగా చెబుతారు. దీనికి ప్రధాన కారణం గర్భధారణపై దీని ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితిలో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అండాశయాలు పూర్తిగా పనిచేయడం ఆపవుని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అ ovulation ఆగిపోవడం వలన గర్భం దాల్చడం కష్టమవుతుంది. దీనికి అదనంగా.. PCOS వలన వేగంగా బరువు పెరగడం, ముఖం, గడ్డంపై అవాంఛిత రోమాలు, మానసిక కల్లోలం (mood swings), తీవ్రమైన అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. మారిన జీవనశైలి, జంక్ ఫుడ్, నిద్రలేమి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఈ రెండు సమస్యలకూ ప్రధాన కారణాలు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి పైన పేర్కొన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భోజనం తర్వాత ఈ ఆకు తింటున్నారా..? నోటి దుర్వాసనతో పాటు మరెన్నో సమస్యలకు చెక్

Advertisment
తాజా కథనాలు