/rtv/media/media_files/2025/10/12/jaggery-2025-10-12-12-37-12.jpg)
Jaggery
Jaggery: చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ బెల్లం (Jaggery) మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ముఖ్యంగా చలికాలంలో బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనతతో సహా అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. బెల్లం భారతీయ సంస్కృతి అందించిన గొప్ప వరం. సాధారణంగా భోజనం తర్వాత బెల్లం తినడం కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్య సంరక్షణలోనూ ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. చక్కెర కేవలం తీపిని ఇస్తే, బెల్లం శక్తిని, జీర్ణ శక్తిని, వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. ఆయుర్వేద గ్రంథాలు బెల్లాన్ని దేవత రస ప్రధాన, వాతవీర్య, వాత-కఫ శామక అని వర్ణించాయి. అంటే ఇది శరీరానికి బలాన్ని ఇచ్చి.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శీతాకాలంలో తీపి పదార్థాన్ని తింటే రక్తహీనత, జలుబు, దగ్గు నుంచి ఎలా ఉపశమనం లభిస్తుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
బెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు:
బెల్లంలో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతతో పోరాడటానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. అయితే చలికాలంలో బెల్లం తినడం వలన శరీరం వెచ్చగా ఉండి.. కఫాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వలన జీర్ణక్రియ సక్రియం అయ్యి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే గ్లూకోజ్, ఎంజైములు శరీరానికి బలాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో జింక్, సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ డైట్ ప్లాన్ ఒకే రోజు ట్రై చేయండి.. శరీరంలోని అన్ని మలినాలను తరిమి కొడుతుంది
అలాగే కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, కాలేయాన్ని శుద్ధి చేయడానికి (Liver Detoxification)సహాయపడుతుంది. జలుబుకు బెల్లం-అల్లం కషాయం, జీర్ణశక్తికి బెల్లం-నెయ్యి, శరీర శుద్ధికి బెల్లం-నిమ్మరసం, రుతుస్రావ నొప్పి నివారణకు బెల్లం-నువ్వులు, గ్యాస్, కడుపు ఉబ్బరానికి బెల్లం-సోంపు తింటే ఆరోగ్యాకి మంచిది. ప్రతిరోజూ కొద్దిగా బెల్లాన్ని ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తీసుకోవడం మంచిది. అయితే బెల్లం వేడి గుణం కలిగి ఉంటుంది కాబట్టి వేసవిలో మితంగా తీసుకోవాలి. ఇది జలుబు, రక్తహీనత, మలబద్ధకం, అలసట, రుతుస్రావం సమస్యలకు ఇది చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నిద్ర కావాలా నాయన.. అయితే ఈ యోగాసనాల గురించి తెలుసుకోండి!!