Health Tips: పురుషులు Vs మహిళలు.. మాంసం ఎవరు ఎక్కువగా తింటారో తెలుసా..?

మాంసం వినియోగంపై చర్చలు పెరుగుతున్నాయి. పురుషుల మాంసం వినియోగం మహిళల కంటే చాలా ఎక్కువగా ఉందని తేలింది. 23 దేశాలలో సుమారు 20,800 మందిపై చేసిన ఈ అధ్యయనంలో పురుషులు, మహిళల కంటే ఎక్కువ మాంసం తింటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

New Update
meat

meat

మానవ ఆహారంలో మాంసాహారం(non-veg) ఒక ముఖ్యమైన భాగం. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు, వంటకాలలో మాంసం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యం, పర్యావరణం, నైతికత వంటి కారణాల వల్ల మాంసం వినియోగంపై చర్చలు పెరుగుతున్నాయి. అత్యధికంగా వినియోగించే ఆహార పదార్థాలలో మాంసం ఒకటి. అయితే మాంసాహార ప్రియులకు ఇదొక ఆసక్తికరమైన అంశం. మాంసం వినియోగం ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఏ దేశాల ప్రజలు లేదా ఏ లింగానికి చెందినవారు ఎక్కువగా మాంసం తింటున్నారు అనే విషయంపై అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్త్రీ, పురుషులలో మాంసం వినియోగం ఎలా ఉంది.. దానికి కారణాలు ఏమిటి అనే వివరాలను ఈ ఆర్టికల్‌లో కొన్ని తెలుసుకుందాం.

మాంసం వినియోగంపై నివేదికలో వెల్లడి:

మాంసాహారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వినియోగించబడుతున్నప్పటికీ.. స్త్రీ, పురుషులలో ఎవరు ఎక్కువగా మాంసం తింటున్నారు అనే విషయంలో ఇటీవల జరిగిన పరిశోధన ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. సాధారణంగా ఆహారపు అలవాట్ల విషయంలో ఎక్కువ తక్కువ తేడాను అంతగా గమనించరు. అయితే పరిశోధన ప్రకారం.. పురుషుల మాంసం వినియోగం మహిళల కంటే చాలా ఎక్కువగా ఉందని తేలింది. 23 దేశాలలో సుమారు 20,800 మందిపై చేసిన ఈ అధ్యయనంలో పురుషులు, మహిళల కంటే ఎక్కువ మాంసం తింటున్నట్లు కనుగొనబడింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన, స్త్రీ, పురుషులకు సమాన హోదా, ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్న దేశాలలో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. మరొక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. 

ఇది కూడా చదవండి: బ్లాక్ కాఫీతో బోలెడు లాభాలు.. అవేంటో తెలుసా?

దీని ప్రకారం.. పురుషులలో రెడ్ మీట్ (Red Meat), ప్రాసెస్డ్ మీట్ (Processed Meat) వినియోగం మహిళల కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని శాస్త్రవేత్తలు బలమైన లింగ భేదం (Strong Gender Difference)గా పేర్కొన్నారు. పురుషులు ఎక్కువగా మాంసం తినడానికి ప్రధాన కారణం సంస్కృతి అని నివేదిక తెలిపింది. అనేక ప్రాంతాలలో పురుషులు తమ పౌరుషాన్ని (Masculinity) నిరూపించుకోవడానికి ఎక్కువ మాంసం తింటారు. అభివృద్ధి చెందిన దేశాలలో.. ఆహారాన్ని ఎంచుకునే స్వేచ్ఛ పురుషులకు ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణం. వయస్సు పెరిగే కొద్దీ మాంసం వినియోగం తగ్గినప్పటికీ.. యువకులు, మధ్య వయస్కులైన పురుషులలో ఇది ఎప్పుడూ మహిళల కంటే అధికంగానే ఉందని పరిశోధన తెలిపింది. అయితే ఈ గణాంకాలు అన్ని దేశాలలో ఒకేలా లేవు. చైనా, భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాలలో స్త్రీ, పురుషుల మధ్య మాంసం వినియోగంలో తేడా చాలా తక్కువగా లేదా అసలు లేదని కూడా నివేదికలో పేర్కొన్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వామ్మో ఖాళీ కడుపుతో ఫ్లాక్స్ సీడ్స్ నీరు తాగాలా..? ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు