/rtv/media/media_files/2025/10/13/thirst-2025-10-13-17-16-11.jpg)
Thirst
నేటి కాలంలో అస్తవ్యస్తమైన జీవనశైలి(human-life-style), అనారోగ్యకరమైన ఆహారం, అధిక రక్తపోటు కారణంగా డయాబెటిస్ (మధుమేహం) అనేది శరీరాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తుంది. చాలా మంది దీని ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా రాత్రిపూట కనిపించే కొన్ని సంకేతాలు మధుమేహాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట కనిపించే కొన్ని లక్షణాలు, ఆ ముప్పు సంకేతాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
రాత్రిపూట కనిపించే ప్రధాన లక్షణాలు :
పదేపదే మూత్రవిసర్జన-దాహం (Frequent Urination and Thirst):
రాత్రిపూట పదేపదే మూత్రవిసర్జన చేయాల్సి వస్తే.. అది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది. అలాగే రాత్రి సమయంలో తరచుగా దాహం వేయడం, ఎంత నీరు తాగినా తీరకపోవడం డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు.
అలసట-బలహీనత (Fatigue and Weakness):
రాత్రంతా బాగా నిద్రపోయినప్పటికీ.. ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా, బలహీనంగా అనిపిస్తే తేలికగా తీసుకోవద్దు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో అసమతుల్యతకు సంకేతం కావచ్చు.
ఇది కూడా చదవండి: మెడపై ఈ సంకేతాలను విస్మరిస్తే అంతే సంగతులు
రాత్రిపూట చెమట- వేగవంతమైన హృదయ స్పందన (Night Sweating and Rapid Heartbeat):
నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా చెమట పట్టడం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే.. అది కూడా రక్తంలో చక్కెర స్థాయిల్లోని లోపాలకు సంకేతం. ఈ సమయంలో శరీరం వణుకుతున్నట్లు, ఆందోళనగా, బలహీనంగా అనిపించవచ్చు. తరచుగా నోరు పొడిబారడం కూడా డయాబెటిస్‌ను సూచిస్తుంది. అయితే పైన తెలిపిన లక్షణాలు తరచుగా కనిపిస్తే. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్తంలో చక్కెర స్థాయిలను తప్పక పరీక్షించుకోవాలి. మధుమేహాన్ని తొలిదశలోనే గుర్తించడం ద్వారా దాని వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: డ్రై ఫ్రూట్స్ ఒరిజినలా? కాదా? ఈ సింపుల్ టెస్ట్‌తో ఇట్టే గుర్తు పట్టండి!!