/rtv/media/media_files/2025/10/10/tech-neck-2025-10-10-10-23-46.jpg)
Tech Neck
ఒకప్పుడు వృద్ధాప్య సంకేతాలు (Signs of Aging) కళ్ళ చుట్టూ లేదా చేతులపై కనిపించేవి. కానీ నేడు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల విపరీత వినియోగం కారణంగా.. వయసు ప్రభావం మన మెడపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీనినే చర్మవ్యాధి నిపుణులు టెక్ నెక్ (Tech Neck) అని పిలుస్తున్నారు. ఈ సమస్యను త్వరగా గుర్తించి.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మది చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకాల వృద్ధాప్యం మెడపై ఉన్న సంకేతాలను విస్మరించే అలవాట్ల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మెడపై ఉన్న సంకేతాలు:
చర్మవ్యాధి నిపుణులు అభిప్రాయం ప్రకారం.. గంటల తరబడి ఫోన్‌లు, టాబ్లెట్‌లు లేదా ల్యాప్‌టాప్‌లను చూస్తూ మెడను వంచి ఉంచడం వల్ల మెడపై ముడతలు, వదులైన చర్మం మరియు గీతలు ఏర్పడతాయి. దీనినే టెక్ నెక్ అంటారు. ఇది మెడ కండరాలు, చర్మం నాణ్యతను ప్రభావితం చేస్తుంది. వంగి కూర్చోవడం, పరికరాల నుంచి వచ్చే బ్లూ లైట్ (Blue Light) కలయికతో ఈ సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పని, జూమ్ మీటింగ్‌లు, సోషల్ మీడియా స్కానింగ్ కారణంగా మెడపై ఏర్పడిన గీతలను తగ్గించుకోవాలంటే కొన్ని అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. అంతేకాకుండా సరైన భంగిమ (Good Posture).. ఫోన్ లేదా ల్యాప్‌టాప్ చూసేటప్పుడు వంగి కూర్చోవడాన్ని నివారించాలి. పరికరాలను కంటి స్థాయిలో ఉంచుకోవడం ఉత్తమం. చిన్న విరామాలు తీసుకోవడం, సరైన భంగిమ పాటించడం ఒత్తిడిని తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: బ్లాక్ కాఫీతో కాలేయానికి రక్షణ.. సిర్రోసిస్, క్యాన్సర్ ముప్పు తగ్గుతుందంటున్న నిపుణులు!!
సూర్యరశ్మి, ఆక్సిడేటివ్ ఒత్తిడి వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. కాబట్టి సన్‌స్క్రీన్‌ను ముఖంతోపాటు మెడ, ఛాతీ (Decollete) వరకు రాయడం చాలా ముఖ్యం. చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెడ చర్మానికి ప్రత్యేక శ్రద్ధ ఇవ్వాలి. ఫైన్ లైన్స్, ముడతలు తగ్గించడానికి రెటినాయిడ్స్ (Retinoids), పెప్టైడ్స్ (Peptides), ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), హైలురోనిక్ యాసిడ్ వంటి హైడ్రేటింగ్ పదార్థాలు (Hydrating Ingredients) వాడాలి. చాలా మంది మెడ, ఛాతీ చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తారని.. కానీ అవి త్వరగా వయసు ప్రభావానికి లోనవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సరైన భంగిమ, చర్మ సంరక్షణ, చికిత్సల కలయిక ద్వారా టెక్ నెక్ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: దగ్గు మందుతో ప్రమాదం.. ప్రతీ దగ్గుకు సిరప్ అవసరం లేదని నిపుణుల సూచనలు