/rtv/media/media_files/2025/11/23/fertility-2025-11-23-14-25-06.jpg)
Fertility
నేటికాలంలో స్మార్ట్‌ఫోన్‌లు (smartphones) జీవితంలో అంతర్భాగం అయింది. ఈ డిజిటల్ యుగంలో అవి మనల్ని లోపలి నుంచి ఎలా దెబ్బతీస్తున్నాయో గుర్తించడం కష్టం. అర్ధరాత్రి వరకు స్క్రీన్ స్క్రోలింగ్ చేయడం, నిరంతర పని కాల్స్, నోటిఫికేషన్ల ఒత్తిడి యువ జంటల్లో హార్మోన్ల సమతుల్యతను, లైంగిక కోరికను (Libido) సంతానోత్పత్తిని (fertility) నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక మంది యువ జంటలకు, మానసిక అలసట శారీరక సాన్నిహిత్యం స్థానంలోకి వచ్చి, ఒత్తిడి అనేది నిరంతర నేపథ్య శబ్దంగా మారింది. కుటుంబ నియంత్రణ గురించి ఆలోచించే సమయంలో మాత్రమే లైంగిక ఆరోగ్యం (sexual health tips) గురించి పట్టించుకున్నప్పటికీ.. ఈ అలవాట్ల దుష్ప్రభావాలు చాలా ముందుగానే కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
స్క్రీన్ టైమ్ లైంగిక ఆరోగ్యాన్ని ..
రాత్రిపూట అధిక స్క్రీన్ వాడకం, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ (Blue Light), నిద్రను నియంత్రించే మెలటోనిన్ (Melatonin) అనే హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది శరీర సహజ నిద్ర (Circadian Rhythm) చక్రానికి భంగం కలిగిస్తుంది. అంతేకాకుండా నిద్ర సరిగా లేకపోవడం వల్ల శరీరం హార్మోన్ల ఉత్పత్తి (ముఖ్యంగా గుడ్డు విడుదల-Ovulation, వీర్యం ఉత్పత్తి, లైంగిక కోరికకు సంబంధించిన హార్మోన్లు దెబ్బతింటుంది. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం డిజిటల్ ఫెటీగ్, నిరంతర డూమ్-స్కాల్లింగ్ కారణంగా మెదడు విశ్రాంతి తీసుకోలేదు. ఫలితంగా శరీరానికి ప్రతిస్పందించడానికి శక్తి ఉండదు. జంటలు భావోద్వేగంగా కనెక్ట్ అవ్వడానికి బదులుగా.. వేర్వేరు పరికరాలపై సమయం గడపడం వల్ల టెక్-డ్రైవన్ ఇంటెమసీ గ్యాప్స్ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది లైంగిక కోరికపై నేరుగా ప్రభావం చూపుతుంది. పురుషులలో ల్యాప్‌టాప్‌లను ఎక్కువసేపు ఒడిలో ఉంచుకోవడం వల్ల వృషణాల (Testicles) చుట్టూ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది వీర్య కణాల సంఖ్యను (Sperm Count) తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: సన్నగా ఉన్నప్పటికీ అనేక మంది భారతీయులకు డయాబెటిస్.. కారణం ఏంటి?
ఒత్తిడితో సంతానోత్పత్తికి నిశ్శబ్ద ఆటంకం:
దీర్ఘకాలిక ఒత్తిడి (Chronic Stress) శరీరాన్ని సర్వైవల్ మోడ్‌లోకి నెట్టివేస్తుంది. దీనివల్ల కార్టిసోల్ (Cortisol), అడ్రినలిన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్లు సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్లయిన టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ సమతుల్యతకు అంతరాయం కలిగిస్తాయి. అయితే స్త్రీలలో అండాశయం నుంచి అండం విడుదల (Ovulation) ఆలస్యం కావడం లేదా సక్రమంగా లేకపోవడం, పురుషులలో వీర్యం సంఖ్య, నాణ్యతలో తగ్గుదల, పురుషులలో అంగస్తంభన సమస్యలు (Erectile Difficulties) పెరగడం. ఇతర వైద్య పరీక్షల నివేదికలు సాధారణంగా ఉన్నప్పటికీ.. గర్భం ధరించడానికి (Conception) ఇబ్బంది పడుతున్న అనేక మంది యువ జంటలకు దీర్ఘకాలిక ఒత్తిడి మూలకారణంగా ఉందని హెచ్చరిస్తున్నారు.
లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి..
ఈ సమస్యలకు చిన్న, స్థిరమైన జీవనశైలి మార్పుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. పడుకోవడానికి 1–2 గంటల ముందు ఫోన్‌ను దూరంగా ఉంచాలి. పడుకునే గదిలో పరికరాలు లేకుండా చూసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత బ్లూ-లైట్ ఫిల్టర్‌లను ఉపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, హార్మోన్లను నియంత్రిస్తుంది, తద్వారా లిబిడో పెరుగుతుంది.
సంతానోత్పత్తి ఆరోగ్య పరీక్షలు..
అంతేకాకుండా రోజుకు 7–8 గంటల నాణ్యమైన నిద్ర పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి ఆరోగ్యానికి చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా భాగస్వామితో రోజుకు 20 నిమిషాలు పరికరాలు లేకుండా గడపడం బంధాన్ని, సాన్నిహిత్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రారంభ హార్మోన్ల మార్పులను గుర్తించడానికి, అవసరమైతే చికిత్స తీసుకోవడానికి క్రమం తప్పకుండా సంతానోత్పత్తి ఆరోగ్య పరీక్షలు (Reproductive Health Check-ups) చేయించుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. ఆరోగ్యం స్క్రీన్ టైమ్ కంటే చాలా ముఖ్యమైనది. సమతుల్య జీవనశైలితో లైంగిక, సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఉదర రోగాలకు కారణాలు ఎన్నెన్నో.. అవేంటో మీరూ తెలుసుకోండి!!
Follow Us