/rtv/media/media_files/2025/05/15/PSckUwV2VqDZFU0dyRAU.jpg)
Morning exercise
Health Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితం వేగంగా మారుతోంది. ఉద్యోగాలు, బాధ్యతలు, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కొనసాగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. కానీ ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పెద్ద మార్పులు అవసరం లేదు. రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేర్చడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆకలిని నియంత్రించేందుకు ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకెళ్లడం మంచిది. దీనివల్ల జంక్ ఫుడ్ తినే అవసరం లేకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. గ్రానోలా బార్లు, గింజలు, తాజా పండ్లు వంటి స్నాక్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Also Read : రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి 3 నెలల రేషన్!
ఉదయం వ్యాయామం..
నీటిని ఎక్కువగా తీసుకవాలి. బిజీగా ఉన్నపుడు నీరు తాగడం మర్చిపోవడం సహజం. అయితే హైడ్రేట్‌గా ఉండటం ద్వారా శరీరంలో ఉండే విషపదార్థాలు బయటకు పోతాయి. తక్కువ కేలరీలు తీసుకునే అవకాశం కలుగుతుంది. ఎక్కువ కెఫిన్, షుగర్ తీసుకుంటే శక్తి స్థాయిలను తగ్గించి అలసటను పెంచుతాయి. అందుకే నీటి బాటిల్‌ను ఎప్పుడూ మీతో తీసుకెళ్ళి అప్పుడప్పుడు తాగాలని నిపుణులు చెబుతున్నారు. వీటితోపాటు వ్యాయామానికి కేటాయించాలి. ఉదయం వ్యాయామం చేయడం ద్వారా ఆ రోజు మొత్తం శరీరం చురుకుగా ఉంటుంది. కొందరూ సాయంత్రం వ్యాయామం చేశారు. కానీ ఉదయం వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: స్నానంలో ఈ తప్పులు చేస్తే.. చర్మానికి డేంజర్‌ని తెలుసా..?
ఈ రోజుల్లో నిద్ర సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజూ 7 నుంచి 9 గంటలు నిద్ర తీసుకుంటే శరీరం విశ్రాంతి పొంది.. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆలస్యంగా నిద్రపోవడం వలన ఉదయం అలసటగా లేచే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ చిన్న మార్పులు మీ జీవనశైలిలో అలవాటు చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read : పదేళ్ళ తర్వాత మళ్లీ రాబోతున్న 'సూపర్‌మ్యాన్' .. ట్రైలర్ భలే ఉంది!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సూర్యాపేట జిల్లాలో విషాదం.. మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )