/rtv/media/media_files/2025/05/15/3j8JZ69aYuI6SaC7Gb6U.jpg)
bath
Daily Hair Wash Side Effects: స్నానం(Bath) అనేది శరీర పరిశుభ్రతను కాపాడుకునే అవసరమైన దినచర్య. ముఖ్యంగా మహిళల దృష్టిలో ఇది అంతకంతకూ కీలకమైన దశగా మారుతుంది. ఎందుకంటే శరీరాన్ని శుభ్రంగా, చక్కగా ఉంచుకోవడమే కాకుండా చర్మం ఆరోగ్యాన్ని, అందాన్ని నిలుపుకోవడానికి కూడా ఇది అవసరం. అయితే చాలా మంది మహిళలు స్నానం సమయంలో కొన్ని సాధారణమైన తప్పులు చేస్తారు. ఇవి దీర్ఘకాలంలో చర్మంపై(Skin) చెడు ప్రభావం చూపుతాయి. ఇలాంటి తప్పులను ఎప్పటికైనా సరిచేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: తల మసాజ్ వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు
ఫంగస్ పెరిగి చర్మానికి దద్దుర్లు..
మహిళలు ప్రతి రోజూ జుట్టు కడుక్కోవడం అలవాటుగా పెట్టుకుంటారు. ఇది మంచిదిగా అనిపించినా.. జుట్టుకు(Hair) మేలు చేయదు. రోజూ షాంపూ(Shampoo) వాడటం వల్ల జుట్టు సహజ నూనె(Oil) తక్కువవుతుంది. ఫలితంగా జుట్టు పొడిగా(Dry Hair), నిర్జీవంగా మారుతుంది. మార్కెట్లో లభించే షాంపూలలో ఘాటైన రసాయనాలు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల వారానికి రెండు మూడు సార్లు తేలికపాటి షాంపూతో జుట్టుకు వాడటం ఉత్తమం. లూఫా, టవల్లను నెలల తరబడి మార్చకుండా, తడిగా ఉన్న వాటిని వాడుతుంటారు. లూఫా తడిగా ఉండడం వలన బాక్టీరియా, ఫంగస్ పెరిగి చర్మానికి దద్దుర్లు, అలెర్జీలు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు తగ్గాలంటే లూఫాను ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి మార్చాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: సొరకాయతో స్వర్గంలాంటి ఆరోగ్యం.. ఈ రసంతో అంతులేని శక్తి
సున్నితమైన ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసేటప్పుడు సబ్బులు, సెంటెడ్ వాష్ల వాడకం. ఇవి pH స్థాయి పెరిగి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యోని స్వయంగా శుభ్రతను నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది. కాబట్టి అలాంటి భాగాలను కేవలం నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా స్నానం సమయంలో సరైన అలవాట్లను, శుభ్రతను పాటించడం వల్ల చర్మ ఆరోగ్యంతోపాటు శరీర మెరుగవుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: సహజంగా జీవక్రియను మెరుగుపర్చే రహస్య శక్తి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం!
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )